బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగా మారింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెబుతుండగా కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్ చనిపోయిన చోట సుసైడ్ లెటర్ లాంటివి లభించకపోవడంతో వారి అనుమానం మరింత పెరిగింది. దీంతో పోలీసులు సుశాంత్ మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేసుకొని విచారణ వేగవంతం చేశారు.
ప్రస్తుతం సుశాంత్ సినిమాల పరంగా బిజీగానే ఉన్నాడు. ఇటీవలే ఆయన తీసిన ‘చిచోరే’ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. కెరీర్ పరంగా రాణిస్తున్న ఈ తరుణంలో సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానం ప్రతీఒక్కరిలో మొదలైంది. దీంతో పోలీసులు కూడా విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియాను పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరు చివరిసారిగా మార్చిన 11న ముంబయిలోని ఓ జిమ్ వద్ద కలిశారు. వారిని ఓ వ్యక్తి ఫోటో తీయటంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా సుశాంత్ చనిపోయిన తరవాత కూడా ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసులు ఆమెను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా వీరిద్దరి మధ్య సంబంధం ఏంటీ? చివరిసారిగా ఎప్పుడు కలిశారు?. సుశాంత్ మృతిచెందే ముందే ఏమైనా మాట్లాడారా? అనే కోణంలో విచారణ చేపట్టనున్నారు. అయితే సుశాంత్ పోస్టుమార్టంలో రిపోర్టులో మాత్రం ఆయన ఉరి వేసుకోవడం వల్లే మృతిచెందినట్లు తేలింది. ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తేలింది. దీంతో సుశాంత్ వ్యక్తిగత కారణాలతో చనిపోయాయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం సుశాంత్ అంత్యక్రియలను ముంబైలో నిర్వహించనున్నారు. ఇప్పటికే పాట్నా నుంచి ముంబైకి సుశాంత్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. సుశాంత్ మృతిపై బాలీవుడ్ తోపాటు తెలుగు, తమిళ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.