Pooja Hegde: గుంటూరు కారం ప్రాజెక్ట్ నుండి పూజా హెగ్డే నిష్క్రమించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డేకి ఈ సినిమా చాలా కీలకం. ఆమె కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. హిట్ కొట్టి రెండేళ్లు కావస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తర్వాత ఆమెకు విజయం దక్కలేదు. అందులోనూ అతిపెద్ద డిజాస్టర్స్ ఇచ్చింది. ఆచార్య, రాధే శ్యామ్ టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్ గా నిలిచాయి. కోట్లలో నష్టాలు మిగిల్చాయి. బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సైతం నిరాశపరిచాయి.
పూజా హెగ్డేకు అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకు గుంటూరు కారం మూవీనే నమ్ముకుంది. త్రివిక్రమ్ ఆమెకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు. ఆయన డైరెక్షన్ లో పూజా నటించిన అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో మంచి విజయాలు సాధించాయి. గుంటూరు కారంతో హ్యాట్రిక్ హిట్ ఇచ్చి తన కెరీర్ త్రివిక్రమ్ మరోసారి నిలబెడతాడని పూజా నమ్మారు. అయితే పూజాకు ఈసారి త్రివిక్రమ్ తీరని అన్యాయం చేశారట.
పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ నుండి తప్పుకోవడానికి కారణాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు కారం స్క్రిప్ట్ పలుమార్లు మార్పులకు గురైంది. ఈ క్రమంలో పూజా హెగ్డే పాత్రకు ప్రాధాన్యత తగ్గిందట. అది ఒక కారణం. పూజా హెగ్డే ఇగో హర్ట్ అయ్యేలా త్రివిక్రమ్ మరొక పని చేశాడట. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీలను మెయిన్ చేశాడట. ఆమె ఫార్మ్ లో ఉన్న నేపథ్యంలో పూజా పాత్రకు నిడివి తగ్గించి శ్రీలీల పాత్రకు వెయిట్ పెంచాడట.
దాంతో చిర్రెత్తుకొచ్చిన పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ చేయను అన్నారట. యూనిట్ కి కూడా పూజా మీద ఆసక్తి లేని క్రమంలో ఓకే అని చెప్పారట. పూజా హెగ్డే టీమ్ మాత్రం డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వలనే పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ చేయడం లేదని వివరణ ఇస్తున్నారు. పూజా నిష్క్రమణతో గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ పోస్ట్ ఖాళీ అయ్యింది. పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్ ని తీసుకునే అవకాశం కాలేదంటున్నారు.