Pooja Hegde : ఈ ఫోటో లో క్యూట్ గా కనిపిస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరో గుర్తు పట్టారా. ఒక అమ్మాయి పాన్ ఇండియన్ హీరోయిన్ పూజ హెగ్డే(Pooja Hegde) అని స్పష్టంగా ఆమె ముఖం చూస్తేనే అర్థం అవుతుంది. మరి ఆమె చంకని ఎక్కిన ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?, ఈమె 2023 మిస్ యూనివర్స్ పోటీలలో రన్నరప్ గా నిల్చింది. మోడలింగ్ రంగం లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ చాలా మంది హీరోలకు కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటో షూట్స్ ని, డ్యాన్స్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. రెండు దశాబ్దాల నుండి సౌత్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న ఒక నటి పేరు, ఈమె పేరు ఒక్కటే.
Also Read : హీరోయిన్ శ్రీదేవి బయోపిక్ లో పూజ హెగ్డే..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్!
ఆమె మరెవరో కాదు త్రిష శెట్టి(Trisha Shetty). ఈమె పూజ హెగ్డే కి కజిన్ అవుతుంది. ముంబై ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి అతి త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి జరుగుతున్నాయి. సినిమాల్లోకి రావడం కంటే ముందు ఈమె ఒక ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది. తన కజిన్ పూజ హెగ్డే కి కూడా దొరకని అరుదైన అదృష్టం త్రిష శెట్టి కి సినిమాల్లోకి రాకముందే దక్కడం మామూలు విషయం కాదు. అయితే నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా పూజ హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చిన్నప్పుడు త్రిష శెట్టి తో కలిసి దిగిన ఒక ఫోటో ని షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షువులను తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘హ్యాపీ బర్త్డే త్రిష..నువ్వు నా ముందు ఎంత చిన్న పిల్లవో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను’ అంటూ ఫోటోని షేర్ చేసింది.
Also Read : మమ్మల్ని డైరెక్టర్స్ ఆ విషయంలో తొక్కేస్తున్నారు : పూజా హెగ్డే
చిన్నప్పుడే అంత క్యూట్ గా కనిపిస్తున్న త్రిష శెట్టి, ఇప్పుడు ఎలా ఉందో చూడాలని మీ అందరికీ అనిపిస్తుంది కదూ..?, అయితే ఈ కథనం చివర్లో పొందుపర్చిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని క్లిక్ చేసి చూడండి. ఇక పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం అంత గొప్పగా సాగడం లేదు అని చెప్పొచ్చు. ఒకానొక దశలో స్టార్ హీరోలందరితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పూజ హెగ్డే, ఇప్పుడు ఏ సినిమా చేసినా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిపోతుంది. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రెట్రో’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక హిందీ లో ఇప్పటికే ఈమె అనేక సినిమాల్లో నటించింది కానీ ఒక్క సక్సెస్ కూడా రాలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘జన నాయగన్’ చిత్రం మీదనే ఉన్నాయి. తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అయితే పూజా హెగ్డే మళ్ళీ ట్రాక్ లో పడినట్టే.
