Shubham : హీరోయిన్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చూసిన సమంత(Samantha Ruth Prabhu) మొట్టమొదటి సారి నిర్మాతగా మారి ‘ట్రాలాలా మూవీ పిక్చర్స్'(Tralala Moving Pictures) అనే సంస్థ ని ఏర్పాటు చేసి నిర్మించిన చిత్రం ‘శుభమ్'(Subham Movie). కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి ఓపెనింగ్ వసూళ్లను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సమంత కి ఓవర్సీస్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కేవలం ఆమె పేరు ని చూసి థియేటర్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య వేలలో ఉంటుంది. ఈ సినిమాకు కూడా ప్రీమియర్ షోస్ నుండే డీసెంట్ గ్రాస్ నమోదైంది. విడుదలకు ఒక్క రోజు ముందే హైదరాబాద్ లో మూడు సెలెక్టివ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేయగా, ఆ షోస్ నుండి ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది.
Also Read : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ ఎలా ఉందంటే?
సినిమా చాలా ఫన్నీ గా ఉందని, కొత్తగా కూడా ఉందని, సమంత ఇలాంటి ప్రయోగాలు చేసి టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఉండాలని ఈ సినిమాని చూసి వచ్చిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సిటీస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చిన్న సినిమా కదా టాక్ జనాల్లోకి వెళ్లి, థియేటర్స్ కి కదిలి రావాలంటే రెండు మూడు రోజుల సమయం పడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ సమంత బ్రాండ్ ఇమేజ్ మ్యాజిక్ క్రియేట్ చేసింది. సాయంత్రం షోస్ నుండి ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. సమ్మర్ లో సరైన హిట్స్ లేక బోసిపోయిన థియేటర్స్ ఉన్న సమయంలో హిట్ 3 చిత్రం విడుదలై సూపర్ హిట్ గా నిల్చి థియేటర్స్ ని ఆడియన్స్ తో నిండిపోయేలా చేసింది.
ఇప్పుడు ‘శుభమ్’ చిత్రం ఆ ట్రెండ్ ని కొనసాగించబోతుంది. ఈ ఏడాది పెద్ద సినిమాలకంటే చ్చిన సినిమాలే ఎక్కువ శాతం సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి శుభమ్ చిత్రం కూడా చేరిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సమంత కి రెండు కోట్ల రూపాయిల ఖర్చు అయ్యుండొచ్చు. కానీ ఈ చిత్రానికి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చే గ్రాస్ వసూళ్లు రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వీకెండ్ కి అత్యధిక ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి నిర్మాతగా మొదటి సినిమాతోనే సమంత బోణీ కొట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఈమె ఎలాంటి ప్రాజెక్ట్స్ ని నిర్మించబోతుందో చూడాలి. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని కూడా స్వీయా నిర్మాణం లోనే తెరకెక్కుతుంది.
Also Read : నిర్మాతగా కూడా సమంత సక్సెస్ అయ్యినట్టే..ఆకట్టుకుంటున్న ‘శుభం’ టీజర్ !