స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వాళ్లలో దాదాపు అందరూ వాట్సాప్ యాప్ ను వినియోగిస్తారు. మెసేజ్ లను పంపే అవకాశంతో పాటు వాట్సాప్ ద్వారా ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది ఈ యాప్ ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వాట్సాప్ ను ప్రతిరోజూ వినియోగించినా చాలామందికి ఈ యాప్ కు సంబంధించిన కొన్ని ట్రిక్స్ గురించి తెలియదు.
మరోవైపు వాట్సాప్ యాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతోంది. వాట్సాప్ ఆడియో ఫైల్స్ ను వాకీ టాకీగా కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఆడియో ఫైల్ ను చెవి దగ్గర పెట్టుకుని వినాలి. అలా చేస్తే సౌండ్ స్పీకర్ల నుంచి కాకుండా స్మార్ట్ ఫోన్ ఇయర్ పీస్ నుంచి వస్తుంది. చాలామంది వాట్సాప్ వెబ్ అకౌంట్లను వినియోగిస్తూ ఉంటారు.
అయితే వాట్సాప్ వెబ్ ను వేరే వ్యక్తులు ఉపయోగించే అవకాశం ఉండటం వల్ల సెట్టింగ్స్ ను ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాట్సాప్ లో అవతలి వ్యక్తి మనల్ని బ్లాక్ చేస్తే ఒక టిక్ మాత్రమే వస్తుందని రెండు టిక్స్ రావని గుర్తుంచుకోవాలి. వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్ వస్తే వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయకుండానే సులభంగా మెసేజ్ ను చదవచ్చు. చాలామంది మొబైల్ నంబర్లతో మాత్రమే వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని అనుకుంటారు.
ల్యాండ్ లైన్ నంబర్ల సహాయంతో కూడా వాట్సాప్ అకౌంట్ ను క్రియేట్ చేయవచ్చు. వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని కాల్ ద్వారా ఓటీపీని కన్ఫర్మ్ చేసుకుంటే సులభంగా ల్యాండ్ లైన్ నంబర్ నుంచి వాట్సాప్ అకౌంట్ ను వినియోగించే ఛాన్స్ ఉంటుంది. టెక్స్ట్ నౌ అనే యాప్ సహాయంతో వర్చువల్ నంబర్స్ నుంచి కూడా వాట్సాప్ అకౌంట్ ను క్రియేట్ చేయవచ్చు.