https://oktelugu.com/

Agent Movie Collections : 8వ రోజు ‘ఏజెంట్’ మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిన ‘విరూపాక్ష’

భారీ అంచనాల నడుమ విడుదలైన అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో వసూళ్లు మ్యాట్నీ షోస్ నుండి బాగా డౌన్ అయ్యాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2023 / 08:25 PM IST
    Follow us on

    Agent Movie Collections : ఇటీవలే థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న ‘విరూపాక్ష’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓపెనింగ్స్ దగ్గర నుండి మొదటి వారం వసూళ్ల వరకు ఈ చిత్రం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.ఇప్పటికి ఈ చిత్రం విడుదలై వారం రోజులు అయ్యింది, ఈ వారం రోజులకు గాను ఈ సినిమా సుమారుగా 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

    సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో హైయెస్ట్ షేర్ వసూళ్లను సాధించిన చిత్రం ‘ప్రతి రోజు పండగే’ ,మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అంత మొత్తం వసూళ్లు ఈ సినిమా కేవలం మొదటి వారం లోనే రాబట్టడం విశేషం.ఇది ఇలా ఉండగా ఈ చిత్రం నేడు విడుదలైన ఏజెంట్ సినిమా మొదటి రోజు వసూళ్లను కూడా చాలా ప్రాంతాలలో క్రాస్ చేసింది.

    భారీ అంచనాల నడుమ విడుదలైన అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో వసూళ్లు మ్యాట్నీ షోస్ నుండి బాగా డౌన్ అయ్యాయి.ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలలో కూడా సాయంత్రం షోస్ నుండి ‘విరూపాక్ష’ చిత్రం ‘ఏజెంట్’ మీద ఎక్కువ ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. ఇది ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపర్చిన విషయం.

    ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఏజెంట్ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.అలాగే ‘విరూపాక్ష’ చిత్రానికి 8 వ రోజు వసూళ్లు రెండు కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా ఉంటుందని సమాచారం,ఒక సినిమాకి పాజిటివ్ టాక్ కి నెగటివ్ టాక్ కి ఎంత వ్యత్యాసం ఉందో ఈ రెండు సినిమాలను చూస్తే అర్థం అయిపోతుంది.