Prabhas: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్. బాహుబలితో తన ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. ఆయనలోని నటనకు భాష్యం చెప్పింది. దర్శకుడు రాజమౌళి సృష్టి ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఇటీవల కాలంలో సెలబ్రీటీలు పలు వివాదాల్లో ఇరుక్కోవడం తెలిసిందే. గతంలో డ్రగ్స్ కేసులో మొత్తం సినిమా పరిశ్రమ వివాదాల్లోకి వచ్చినా తరువాత ఏమైందో కానీ దాని ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రభాస్ కూడా ఓ వివాదంలో దూరారు.

ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లో నిఘా ముమ్మరం చేశారు. సెటబ్రిటీలైనా ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. దీంతో తాజాగా నటుడు ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 36లో నీరుస్ కూడలి వద్ద బ్లాక్ ఫ్రేమ్ తో వెళ్తున్న కారును వెంబడించి పట్టుకున్నారు.
Also Read: Bigg Boss Telugu OTT: బంధాన్ని తట్టిలేపి కంటెస్టెంట్లను ఏడిపించిన బిగ్ బాస్
తీరా చూస్తే అది ప్రభాస్ ది అని తేలింది. కారును ఆపి పరిశీలించినా అందులో ప్రభాస్ లేరు. నంబర్ ప్లేటు సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ్రేమ్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు రూ. 1450 జరిమానా విధిస్తూ చలానా వేశారు.

గతంలో కూడా నటులు ఎన్టీఆర్, మంచు మనోజ్ కార్లకు ఇలాగే జరిమనాలు విధించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎంతటి వారికైనా జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతి జరిమానాలు తప్పనిసరని తెలుస్తోంది. సో భాగ్యనగర వాసులు జాగ్రత్తలు తీుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:KGF 2 Telugu Movie Dialogues: `కేజీఎఫ్ 2` పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే !