IPL 2022 MI vs LSG: ముంబై ఇండియన్స్ అపజయాల మూటగట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచుల్లో ఓటములే పలకరించాయి. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ లో నెగ్గకపోతే కష్టమే. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం గమనార్హం.

నేడు ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెంట్స్ తో తలపడనుంది. ఇప్పటికే లక్నో మూడింటిలో విజయం సాధించి రెండింటిలో గెలిచింది. ముంబై ఇండియన్స్ పరిస్థితి మాత్రం అధ్వానంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ లో చావో రేవో అనే స్థితిలో సాగనుందని తెలుస్తోంది. నేటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే ప్లే ఆప్స్ అవకాశాలు దక్కవు. దీంతో రోహిత్ సేనకు ఇక విజయం అత్యవసరమనే వాదన వస్తోంది.
ముంబై ఇండియన్స్ ఫామ్ లో లేకపోవడంతో ఇవాళ జరిగే మ్యాచ్ లో ప్రభావం చూపుతుందా లేక ఓటమినే ఎంచుకుంటుందా అని అనుమానాలు వస్తున్నాయి. బౌలింగ్ లో ఇబ్బందులు పడుతోంది. బుమ్రా రాణిస్తున్నా అతడికి సహకరించే వారు ఎవరు లేకపోవడంతో జట్టు విజయం అందుకోలేకపోతోంది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ లో ఉన్నా మిగతా వారు ఇబ్బందులు పడుతున్నారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇసాన్ కిషన్ అంతగా రాణించడం లేదు. దీంతో మ్యాచ్ చేజేతులా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే మ్యాచ్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు లక్నో మంచి ఫామ్ లో ఉండటంతో ముంబై ఇండియన్స్ ఓటమి కోరల నుంచి రక్షించుకుంటుందా? లేక లక్నోకు మళ్లీ విజయం దక్కేలా చేస్తుందా అని అందరు చర్చించుకుంటున్నారు.