Homeఎంటర్టైన్మెంట్Kapata Naataka Suthradhari Movie: వైభవంగా "కపట నాటక సూత్రధారి" ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్య...

Kapata Naataka Suthradhari Movie: వైభవంగా “కపట నాటక సూత్రధారి” ప్రీ రిలీజ్ ఈవెంట్… ముఖ్య అతిధిగా “నాంది” డైరెక్టర్ విజయ్

Kapata Naataka Suthradhari Movie: క్రాంతి సైనా దర్శకత్వంలో విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం “కపట నాటక సూత్రధారి”. ఈ సినిమా కి మనీష్ నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తెలుగు తెరకు కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. కాగా సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందించగా… రామ్ తవ్వ సంగీతం అందించారు. అలానే ఈ చిత్రంలో సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాష్… అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12 న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

picutes from kapata naataka suthradhari movie pre release event got viral

ఈ మేరకు కార్యక్రమానికి కమెడియన్ శివారెడ్డి , నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టైటిల్ చాలా బాగుందని… ఇన్ని రోజులు ఇంత మంచి టైటిల్ ఎలా వదిలేశారని అనిపించింది అని శివారెడ్డి అన్నారు. అలానే నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ… ఈ సినిమా చేసిన దర్శక నిర్మాతలకు అల్ ది బెస్ట్ అని చెప్పారు. దర్శకుడు క్రాంతి తనకు చాలా సన్నిహితుడు అని ఎన్నో సినిమాలకు మేము కలిసి పని చేశాం అని చెప్పారు. ఇప్పుడు తన స్నేహితుడు దర్శకుడు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలానే నిర్మాత మనీష్ కూడా తనకు ఆప్త మిత్రుడు అని తెలిపారు. తనకు బాగా కావలసిన వారిద్దరు ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని… మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని చెప్పి ముగించారు విజయ్ కనకమేడల. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular