Peddi Shivarajkumar Glimpse: ‘ సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ స్టార్ రాంక్ హారం నటించిన ‘పెద్ది’ మూవీ మేనియా నే కనిపిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఒక రోజు ముందుగా , అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ కూడా పడబోతున్నాయి. సినిమా విడుదలకు సరిగ్గా 3 వారాల సమయం మాత్రమే ఉంది, కానీ మేకర్స్ ఆశించిన స్థాయిలో ప్రొమోషన్స్ చేయడం లేదని సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. వాళ్ళ బాధని అర్థం చేసుకున్న మేకర్స్, రోజుకి ఎదో ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మే 18 నుండి ఎలాగో దేశవ్యాప్తంగా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ ని ప్లాన్ చేశారు , అందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా నేడు విడుదల చేశారు.
అదే విధంగా ఇంటర్వ్యూస్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కాసేపటి క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో బుచ్చి బాబు రామ్ చరణ్ తో కలిసి డ్రైవ్ లో వెళ్తూ , అభిమానులతో 2 నిమిషాల పాటు లైవ్ ఇంటరాక్షన్ ని ఏర్పాటు చేశాడు . రామ్ చరణ్ గారితో పెద్ది గురించి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ ని చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో విడుదలైన కొద్ది నిమిషాలకే మరో వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఇది ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కి సంబంధించిన వీడియో. కన్నడ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈయన , ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఆయనకు సంబంధించిన లుక్ ని విడుదల చేయకుండా సస్పెన్స్ లో ఉంచారు మేకర్స్.
నేడు ఆయనకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో శివరాజ్ కుమార్ గౌర్ నాయుడు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయన కుస్తీ మాస్టర్ , రామ్ చరణ్ కి గురువు గా కనిపించనున్నాడు. ఈ వీడియో లో ఆయన కుస్తీ పోటీ దారులకు శిక్షణ ఇవ్వడాన్ని మనం చూడొచ్చు , ఒక పహిల్వాన్ ని ఆయన ఒంటి చేతితో పైకి లేపి కిందకు విసిరి వేయడం హైలైట్ గా నిల్చింది. అనేక సందర్భాల్లో శివరాజ్ కుమార్ ఈ పాత్ర నా కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోతుందని చెప్పుకుంటూ వచ్చాడు. ముందుగా ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి ని సంప్రదించారు కానీ , ఆయన ఎందుకో ఒప్పుకోలేదు. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Gournaidu a.k.a @nimmashivanna garu❤️❤️
Step into the raw world of #PEDDI#PEDDITrailer in 4 days
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/HAV93MYYab
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 14, 2026