Peddi overseas bookings: గత ఏడాది దసరా కానుకగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఓపెనింగ్స్ లో అయితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా #RRR తో సమానంగా రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబెట్టారు. కేవలం నార్త్ అమెరికా నుండే ప్రీమియర్ షోస్ ద్వారా 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. కేవలం ప్రీ సేల్స్ ద్వారానే 2.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందని అందరూ భావించారు కానీ , ఓవర్సీస్ కి ప్రింట్స్ సరైన సమయానికి చేరకపోవడం వల్ల కుదర్లేదు. లేదంటే ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చేదని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే ఈ రికార్డు ని ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే మార్కెట్ లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు, పైగా చాలా రోజుల నుండి ఆడియన్స్ సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. దాదాపుగా వెయ్యి షోస్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించగా, 5 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 1 లక్షా 45 వేల వరకు వచ్చింది. ఇది మొదటి 24 గంటల్లో వచ్చిన గ్రాస్ వసూళ్లు. అయితే ఓజీ చిత్రానికి మొదటి 24 గంటల్లో వచ్చిన గ్రాస్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం , ఓజీ చిత్రానికి మొదటి 24 గంటల్లో 2 లక్షల 67 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఆ తర్వాతి స్థానం లో పెద్ది చిత్రం 1 లక్షా 45 వేల తో రెండవ స్థానం లో కొనసాగుతుంది. మూడవ స్థానంలో కల్కి చిత్రం 1 లక్షా 34 వేలతో కొనసాగుతుండగా, దేవర చిత్రం 1 లక్షా 22 వేల డాలర్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం 85 వేల గ్రాస్ తో 5 వ స్థానంలో కొనసాగుతుంది. పెద్ది కి 24 గంటల్లో మంచి గ్రాస్ వచ్చింది కదా, కాని అనుకున్నంత గ్రాస్ రాలేదని ఎలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. పైన చెప్పిన సినిమాల్లో షోస్ పెంచే కొద్దీ వేరే లెవెల్ గ్రాస్ నమోదు అయ్యింది. కానీ ‘పెద్ది’ కి ఏకంగా వెయ్యి షోస్ తో బుకింగ్స్ ని మొదలు పెట్టారు , హైప్ ప్రకారం 3 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి , కానీ అంత రేంజ్ లో రాలేదు , రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.