Peddi OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచానాల నడుమ విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో దాదాపుగా అన్ని సెంటర్స్ లోనూ రన్ ని పూర్తి చేసుకుంది. దీంతో నిన్న అర్థరాత్రి నుండి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు , తమిళం , మాయలయం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ విడుదల అయ్యేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందట. అయితే ఓటీటీ లో విడుదలయ్యాక ఈ సినిమాని చూసిన రిపీట్ ఆడియన్స్ షాక్ కి గురి అవుతున్నారు. ఇదేంటి థియేటర్ లో మాకు వేరే ప్రింట్ వేశారు , ఈ సన్నివేశాలు థియేటర్ లో చూసినప్పుడు లేవే అంటూ కామెంట్స్ చేశారు.
అంటే థియేటర్ లో చూడని కొన్ని కొత్త సన్నివేశాలతో పాటు , విడుదల కొత్తల్లో ఈ సినిమాపై తీవ్రమైన నెగెటివిటీ , వివాదాలు క్రియేట్ చేసిన కొన్ని సన్నివేశాలను , డైలాగ్స్ ని కట్ చేసారని అంటున్నారు ఫ్యాన్స్. థియేటర్స్ కి అంటే సెన్సార్ కావాలి కానీ , ఓటీటీ కి అసలు అవసరం లేదు, ఇష్టమొచ్చినట్టు డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టుకోవచ్చు , నేరుగా బూతులు మాట్లాడిన డైలాగ్స్ కూడా పెట్టొచ్చు , అలాంటి ఓటీటీ లో ఈ ఎడిటెడ్ వెర్షన్ అవసరమా ? అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. థియేటర్స్ లో ఈ చిత్రం రన్నింగ్ లో ఉన్నప్పుడు 3 వ వారం లో కొత్త సన్నివేశాలను జత చేశారు. కానీ అప్పటికే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించేశారు.
మూడవ వారం లో రిపీట్ గా చూసినవాళ్లకు , అదే విధంగా కొత్తగా మూడవ వారం లో చూసిన వాళ్లకు మాత్రమే , ఈ ఓటీటీ వెర్షన్ అర్థం అవుతుంది. అలా కాకుండా థియేటర్ లో కేవలం మొదటి రోజు చూసి , ఆ తర్వాత రిపీట్ గా వేళ్ళని ఆడియన్స్ కి మాత్రం , ఇదేంటి.. థియేటర్ లో మాకు చూపించిన సినిమా ఇది కాదే అని అనిపించక తప్పదు. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది దసరా నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
