Peddi movie vs Durandhar 2 record: బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొద్ది రోజుల నుంచి వెనుకబడిపోయింది. కానీ ‘దురంధర్’ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిందనే చెప్పాలి. ఇండియా వైడ్ గా ఈ సినిమాకి భారీ పాపులారిటి దక్కింది. ఇక ‘దురంధర్ 2’ సినిమా రీసెంట్గా వచ్చి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ఈ సినిమాకి ఇప్పటికి వరకు 1500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి… గతః సంవత్సరము భారీ సక్సెస్ లనుసదించిన సినిమాల్లో దురంధర్ సినిమా ఒకటిగా నిలిచింది. అయితే ఈ సంవత్సరం వచ్చిన ‘దురంధర్ 2’ సినిమా సైతం ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిందనే చెప్పాలి. పెద్ది సినిమా ‘దురంధర్ 2’ రికార్డును బ్రేక్ చేసి ఈ సంవత్సరం ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా ఈ మూవీ నుంచి రామ్ చరణ్ ను లుక్ రిలీజ్ అయింది.
అందులో రామ్ చరణ్ ను బాడీ బిల్డర్ లుక్ లో చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 30 వ తేదీన రిలీజ్ అవుతుందటు అనౌన్స్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద సినిమా యూనిట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఇది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ఆయన టాప్ రేంజ్ కి వెళ్ళాడు. సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన మార్కెట్ తగ్గలేదు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకొని టాప్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు…