Homeఎంటర్టైన్మెంట్Rajinikanth latest movie controversy: రజినీకాంత్ ఆ ఒక్క సినిమా విషయంలో తప్పు చేస్తున్నాడా..?

Rajinikanth latest movie controversy: రజినీకాంత్ ఆ ఒక్క సినిమా విషయంలో తప్పు చేస్తున్నాడా..?

Rajinikanth latest movie controversy: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్ని ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటున్నాయి. తమిళ్ తో పాటు ఇండియా వైడ్ గా భారీ పాపులారిటిని సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. గతంలో ఆయన చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినప్పటికి ‘జైలర్’ సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి కూడా నెల్సన్ డైరెక్షన్ చేయడం విశేషం…

కమల్ హాసన్ తో నటించడం పట్ల కొంతమంది రజినీకాంత్ అభిమానులు సైతం సంబరపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం కమల్ హాసన్, రజనీకాంత్ నటించడం వాళ్ళిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల రజినీకాంత్ క్యారెక్టర్ ఏమైనా కొంచెం తగ్గితే చూడడానికి అసలు బాగుండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి రజనీకాంత్ కమల్ హాసన్ మంచి ఫ్రెండ్స్ అయినప్పటికి వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం ఎప్పుడు పోటీ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ ఆధారంగా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించిన వారే కావడం విశేషం… ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ మధ్యకాలంలో ఒక మల్టీస్టారర్ సినిమా కూడా రాలేదు. ఇప్పుడు వస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ భావించి ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కమల్ హాసన్ అభిమానులు రజనీకాంత్ ఫ్యాన్స్ సంబరపడతారా లేదంటే ఎవరైనా ఒకరి మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… కమల్ హాసన్ ఇంతకుముందు చేసిన ‘భారతీయుడు 2’ సినిమా ఆశించిన సక్సెస్ ను సాధించలేదు. దాంతో ఆయన మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో దాన్నిబట్టి తర్వాత రాబోయే సినిమా మీద అంచనాలైతే ఉంటాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version