Ram Charan Peddi movie remuneration: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ప్రతి సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పెద్ది సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుందంటు వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక క్రెడిబులిటి ఉంది… రామ్ చరణ్ ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నాడు. ఈ రెమ్యూనరేషన్ లో సగభాగం ఆయన కొన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ స్వతహాగా కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. కానీ ఆ విషయాలు ఏమీ బయటకి చెప్పకుండా చాలా రహస్యంగా మెయింటెన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ గతంలో కొని సేవ కార్యక్రమాలను చేపట్టాడు. ఇప్పుడు అంతకు మించిన సేవ చేయాలని తన వంతు సమాజానికిఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతున్నట్టుగా తెలుస్తుంది.
అందుకే ఆయన అమౌంట్ లో నుంచి సగభాగం సేవ కార్యక్రమాలకు ఉపయోగించారనే విషయాల మీద ఇంకా సరైన క్లారిటీ రాలేదు. కానీ రామ్ చరణ్ యూనిట్ నుంచి అందుతున్న విషయాలను బట్టి చూస్తే ఆయన చాలా పెద్ద సేవ కార్యక్రమాల్ని చేయడానికి భారీ మొత్తంలో అమౌంట్ కలెక్ట్ సేవ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…తొందర్లోనే దీనికి సంబంధించిన క్లారిటీని కూడా ఇవ్వబోతున్నాడట.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించినట్టు రామ్ చరణ్ కూడా అలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి… ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చిన్నచితక ఆర్టిస్టులకు తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాడు…గతంలో చిరంజీవి ఎలాగైతే సేవ చేశాడో ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు…