Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 5.4.2026 : ఈ నాలుగు రాశుల వారి ఇంట్లో ఈరోజు...

Today horoscope in telugu 5.4.2026 : ఈ నాలుగు రాశుల వారి ఇంట్లో ఈరోజు ధన ప్రభావం..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఇంట్లో ఈరోజు ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఇంట్లో ఈరోజు ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మానసిక బాధల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారులకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరపు పనులకు దూరంగా ఉండటమే మంచిది. వివాదాలు ఏర్పడినప్పుడు సంయమనం పాటించాలి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. చట్టపరమైన చెక్కుల నుంచి బయటపడతారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గుర్తింపు పొందుతారు. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రహాల అనుకూలతతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. కొత్తగా అప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అందరినీ ఆకట్టుకునేందుకు ప్రవర్తనను మెరుగుపరచుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత జీవితం లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో తమ కార్యకలాపాలను విస్తరిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో ఊహించని విజయాలను పొందుతారు. ఆర్థిక లావాదేవీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో కాస్త మనసును అదుపులో ఉంచుకోవాలి. ప్రియమైన వారి కోసం సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అన్ని రకాలుగా కలిసివస్తుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా శుభ ఫలితాలు అందే అవకాశం ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునేందుకు తమ మాట తీరును మెరుగుపరుచుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సూర్యదేవుడి అనుగ్రహం ఉండడం వల్ల వ్యాపారులకు అధికంగా లాభాలు వస్తాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల నుంచి ధన సహాయం అందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అదృష్టం కలిసి రావడంతో ఉద్యోగులకు అదనపు బాధ్యతలతో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper