Peddi Movie Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో ‘పెద్ది'(Peddi Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అందుకు కారణం రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్ వీడియో నే. ఈ గ్లింప్స్ లోని డైలాగ్స్, పెద్ది సిగ్నేచర్ షాట్ ఆడియన్స్ కి మతిపోయేలా చేసింది. క్రికెట్ లో ఇలాంటి షాట్ కూడా ఆడుతారా అంటూ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఈ షాట్ ని ఆడే ప్రయత్నం చేస్తూ కొన్ని వీడియోలు తయారు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ప్రస్తుతం ఈ పెద్ది సిగ్నేచర్ షాట్ ని యూత్ ఆడియన్స్ ఏ రేంజ్ లో అనుసరిస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో అభిమానులకు కావాల్సినవి మొత్తం ఉన్నాయి.
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
రామ్ చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ ఉంది. ఈ సినిమాలో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. AR రెహమాన్(AR Rahman) అందించిన ట్యూన్ అద్భుతంగా వచ్చిందని, ఆయనలోని వింటేజ్ మార్క్ కి నిదర్శనంగా ఈ ఐటెం సాంగ్ ఉంటుందని సమాచారం. ఇందులో ఒక ప్రముఖ హీరోయిన్, ఇప్పటి వరకు రామ్ చరణ్ తో కలిసి నటించని హీరోయిన్ కనిపించబోతుందట. ఆమె ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అత్యధిక శాతం అభిమానులు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అని అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) కూడా అయ్యుండొచ్చు అని అంటున్నారు. ఈ ఇద్దరి పేర్లు కాకుండా శ్రీలీల(Sreeleela) కూడా రామ్ చరణ్ తో కలిసి ఇప్పటి వరకు నటించలేదు కాబట్టి ఆమె కూడా అయ్యుండొచ్చు ఏమో అని అనుకుంటున్నారు.
మరి రామ్ చరణ్ సరసన ఎవరి ఆడిపాడనున్నారు అనే దానిపై కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ ని దాదాపుగా ఖరారు చేసేసుకోవచ్చు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ‘దేవర’ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత ఆమె నుండి విడుదల కాబోతున్న సినిమా ఇది. మొదటి సినిమాలో నటనకు పెద్దగా ప్రాధాన్యత దొరకలేదు కానీ,పెద్ది లో మాత్రం మంచి క్యారక్టర్ దొరికిందని అంటున్నారు. చూడాలి మరి ఈమె తెలుగు ఆడియన్స్ లో ఏ మాత్రం సుస్థిరమైన స్థానం పొందుతుంది అనేది. రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమాని మించి ఈ చిత్రం ఉంటుందట. డైరెక్టర్ బుచ్చి బాబు ఆ రేంజ్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నారని అంటున్నారు.