Annadata Sukhibhava vs PM Kisan benefits 2025: ఏపీ ప్రభుత్వం ( AP government) సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. వరుసగా పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. మొన్నటికి మొన్న తల్లికి వందనం అమలు చేసింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 47.77 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చింది. సొంత భూమి ఉన్న డి పట్టాదారులు, ఎస్సైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులను కూడా అర్హులుగా గుర్తించింది. మరోవైపు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ తప్పకుండా అన్నదాత సుఖీభవ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కేంద్రం పిఎం కిసాన్ నిధులు విడుదల తోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చిన మరుక్షణం వాటితో జత కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5000 రూపాయలు అందించడానికి నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: AP Rythu Bharosa vs Annadata Sukhibhava: రైతులకు ప్రభుత్వం భరోసా ఇస్తుందా లేక తప్పిస్తుందా?
పిఎం కిసాన్ కు అనుబంధంగా..
కేంద్రం అందించే పీఎం కిసాన్( pm Kisan) పథకానికి అనుబంధంగా ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలవుతుంది. గతంలో జగన్ సర్కార్ రైతు భరోసా పేరిట ఈ పథకాన్ని అమలు చేసేది. ఇప్పుడు దాని స్థానంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే 6000 రూపాయల నగదు తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో రూ.14,000 అందించనుంది. అయితే పీఎం కిసాన్ అందించే మూడు విడతల్లో.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కూడా అందనుంది. తొలి విడతల్లో కేంద్ర ప్రభుత్వం తో కలిపి అన్నదాత సుఖీభవ కింద 7వేల రూపాయల చొప్పున అందించనున్నారు. చివరి విడతలో మాత్రం 6000 రూపాయలు అందించేందుకు నిర్ణయించారు. అంటే ఏడాదిలో రూ.20,000 అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుందన్నమాట.
Also Read: Indiramma Aatmiya Bharosa: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. వచ్చే వారంలో ఖాతాల్లోకి రూ.6వేలు?
జూలై మొదటి వారంలో జమ..
అయితే అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి సంబంధించి తొలి విడత నిధులు జూలై మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ లో రెండో విడత, వచ్చే ఏడాది జనవరిలో మూడో విడతగా అన్నదాత సుఖీభవ పథకం అమలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. https:// anndatasukhibhava.ap.gov.in లోకి వెళ్లి స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. రైతు తన ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చు.