Peddi
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని ఇటీవలే శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయగా, ఆ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. రామ్ చరణ్ లుక్స్ దగ్గర నుండి, డైలాగ్స్ వరకు ఫ్యాన్స్, ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇది కదా అసలు సిసలు రామ్ చరణ్ సినిమా అంటే అని సోషల్ మీడియా లో అభిమానులు గర్వంతో కామెంట్స్ చేస్తున్నారు. ఇక గ్లింప్స్ లోని చివరి షాట్ కి అయితే అభిమానులు మెంటలెక్కిపోయారు. ఎన్నో ఏళ్ళ నుండి క్రికెట్ ని అమితంగా ఇష్టపడి చూసేవాళ్ళు కూడా తమ అభిమాన క్రికెటర్స్ నుండి ఇలాంటి షాట్స్ ని చూడలేదు. ధోని హెలికాప్టర్ షాట్ ఎలా అయితే ట్రెండ్ అయ్యిందో, ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ది సిగ్నేచర్ షాట్ అలా ట్రెండ్ అవుతుంది.
Also Read : పెద్ది మూవీకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మైనస్ కానుందా.?
కేవలం కొన్ని గ్లింప్స్ లేదా టీజర్ వీడియోలు అభిమానులు, ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ ని కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. పెద్ది కూడా అలాంటి క్యాటగిరీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగా ఫ్యామిలీ హీరోలను నిత్యం విమర్శించే అలవాటు ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) లాంటోళ్ళు కూడా ఈ గ్లింప్స్ వీడియోపై పాజిటివ్ గా స్పందించారంటే ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మీరే అర్థం చేసుకోవచ్చు. నిన్న రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఈ గ్లింప్స్ గురించి వేసిన ట్వీట్ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. ఆయన మాట్లాడుతూ ‘ పెద్ది చిత్రం రామ్ చరణ్ కి అసలు సిసలైన గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గ్లింప్స్ కేవలం గ్లోబల్ గా మాత్రమే కాదు, విశ్వం మొత్తం మెచ్చుకునేలా ఉంది. హేయ్ బుచ్చి బాబు, ఇంతకు ముందు నేను రామ్ చరణ్ పొటెన్షియల్ సరిగ్గా ఉపయోగించుకున్నది కేవలం రాజమౌళి మాత్రమే అని అనుకున్నాను. కానీ నువ్వు రాజమౌళి నే ఈ విషయం లో మించిపోయావు. నీ సినిమా కచ్చితంగా ట్రిపుల్ సిక్సర్ కొట్టబోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం ఆగస్టు నెలలోపు పూర్తి చేయబోతున్నారట. ఆ తర్వాత కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను, పాటలను సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 నే విడుదల చేయడానికి ప్రధాన కారణం నెట్ ఫ్లిక్స్ లో ఈ ఏడాది కి సంబంధించిన స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోవడమే. అందుకే వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది.
Also Read : బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’..కళ్ళుచెదిరే బిజినెస్ ఆఫర్స్!
There’s no doubt that PEDDI will be the actual real GAME CHANGER and @AlwaysRamCharan doesn’t look just GLOBAL but he looks UNIVERSAL .. Hey @BuchiBabuSana not since @ssrajamouli i felt any director understood the true potential of Charan more than you ..For sure ur film will…
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Peddi ram gopal varma viral tweet director response
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com