Jr. NTR
Jr. NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తు ఉండటం విశేషం… మరి ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నప్పటికి ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికి ఇండస్ట్రీ హిట్లుగా మాత్రం మారలేకపోతున్నాయి. కారణమేదైనా కూడా తనకి ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తన ఎంటైర్ కెరియర్ లో చాలా విభిన్నమైన పాత్రలైతే పోషించాడు.
Also Read : అడవుల్లోకి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు..అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ అప్డేట్!
ఇక పౌరాణిక పాత్రలను మాత్రం ఆయన ఇప్పటివరకు టచ్ చేయలేదు. చిన్నప్పుడు బాల రామాయణం లో రాముడిపాత్ర చేశాడు. హీరో అయిన తర్వాత మాత్రం చేయలేదు కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక అతను హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాముడిగా తనని చూడాలని చాలామంది అనుకున్నారు.
ఆయన దగ్గరికి కొందరు రామాయణానికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా తీసుకుపోయినప్పటికి ఆయన వాటిని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో రాముడి పాత్రను పోషించాలంటే ‘నందమూరి తారక రామారావు’ గారి వల్ల మాత్రమే అవుతుంది. ఇక ఆయన తర్వాత ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయిస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నప్పటికి ఎన్టీఆర్ మాత్రం రాముడి పాత్రలో నటించడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు.
ఆయనకి చాలా సార్లు రాముడు పాత్రను పోషించడానికి అవకాశం వచ్చినప్పటికి ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడం అతని అభిమానుల్లో కొంతవరకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. రాముడి పాత్రలో తను కనుక కనిపించి ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయి ఉండేదని తద్వారా ఆయన క్రేజ్ కూడా భారీ రేంజ్ లో పెరిగిపోయేదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…