Phone Addiction (2)
Phone Addiction: భారత దేశంలో(India) ఏటా ఫోన్ వినియోగం పెరుగుతోంది. ఆండ్రాయిడ్(Android) ఫోన్లు వచ్చాక.. ఫోన్ చూసేవారి సంఖ్య పెరిగింది. ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక, సోషల్ మీడియా యాప్స్(Social Media aaps) పెరగడంతో చాలా మంది రోజులు 12 నుంచి 15 గంటలు ఫోన్‌తోనే గడుపుతున్నారు. కొందరు వృత్తి కోసం ఫోన్లు వినియోగిస్తుంటే.. మరికొందరు.. టైంపాస్ కోసం ఫోన్లు వాడుతున్నారు. ఈ క్రమంలో 2024లో భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లను చూస్తూ గడిపిన సమయం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎకనామిక్స్ టైమ్స్ (Econamics Times)నివేదిక ప్రకారం, ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.1 లక్ష కోట్ల గంటలు (1.1 ట్రిలియన్ గంటలు) ఫోన్‌లలో గడిపారు. సగటున ప్రతీ భారతీయుడు రోజుకు ఐదు గంటలు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించారని, ఎక్కువగా సోషల్ మీడియా, గేమింగ్ మరియు వీడియోలపై దృష్టి సారించారని తెలుస్తోంది.
ఈ భారీ డిజిటల్ వినియోగం 5జీ సాంకేతికత వేగవంతమైన వ్యాప్తి, చౌకైన డేటా ధరల వల్ల సాధ్యమైంది. దీని ఫలితంగా భారతదేశం మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ట్రెండ్ డిజిటల్ ఛానెళ్లను వినోద పరిశ్రమలో టెలివిజన్‌ను మించిన అతిపెద్ద విభాగంగా మార్చింది.
విపరీతంగా వాడకం..
ఆండ్రాయిడ్ ఫోన్లను భారతీయులు విపరీతంగా వాడేస్తున్నారు. ఫోన్ వాడకం ఈ–కామర్స్, సోషల్ మీడియా ప్రకటనలు మరియు రాజకీయ ప్రచారాలకు కూడా ఊతమిచ్చింది, దీనివల్ల పెద్ద వ్యాపారాలు, సినిమా నిర్మాతలు మరియు రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఈ గణాంకాలు భారతదేశం డిజిటల్ విప్లవంలో ఎంత వేగంగా ముందుకు సాగుతుందో సూచిస్తాయి. అయితే, ఇంత సమయం స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల వ్యక్తిగత ఉత్పాదకత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.