Peddhi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) బుచ్చి బాబు(Buchhi Babu Sana) తో కలిసి చేస్తున్న చిత్రం ‘పెద్ది'(Peddi Movie). నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, సోషల్ మీడియా మొత్తం వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ అవుతూనే ఉన్నింది. కేవలం లోకల్ మీడియా లో మాత్రమే కాదు, నేషనల్ మీడియా కూడా ఈ ఫస్ట్ లుక్ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. రామ్ చరణ్ మేక్ ఓవర్ కి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ‘గేమ్ చేంజర్’ ఫలితాన్ని కాసేపు మర్చిపోయేలా చేసింది ఈ ఫస్ట్ లుక్. నిన్నటి నుండి నేటి వరకు ట్విట్టర్ లో #Peddi అనే హ్యాష్ ట్యాగ్ మీద దాదాపుగా మూడు లక్షల ట్వీట్లు పడ్డాయి. ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు.
Also Read : పెద్ది’ టీజర్ విడుదల ఇప్పట్లో లేనట్టే..కారణం ఏమిటంటే!
ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటో చెప్పేశాడు. గుర్తింపు కోసం పోరాటం అని ఆయన పెట్టిన క్యాప్షన్ బాగా వైరల్ అయ్యింది. మారుమూల గ్రామంలో ఉండే ఒక కుర్రాడికి అన్ని రకాల ఆటల్లో గొప్ప ప్రతిభ ఉంటుంది. కానీ అది బయటపడేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఆ అద్దనుకులను దాటుకొని హీరో జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో గుర్తింపుని సంపాదిస్తాడా లేదా అనేదే స్టోరీ అని స్పష్టంగా మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ చెవులు పని చేయవు, పుట్టుకతోనే మూగ అనే టాక్ నడుస్తుంది. ఛాలెంజింగ్ రోల్స్ లో ప్రస్తుతం ఇండియా లో రామ్ చరణ్ ని మించి ఏ హీరో కూడా అద్భుతంగా జీవించలేరని అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. ఈ సినిమాలో కూడా ఆయన క్యారక్టర్ అదే రేంజ్ లో ఉంటుందని సమాచారం.
రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ కి తృటిలో నేషనల్ అవార్డు మిస్ అయ్యింది, కానీ ఈ సినిమాతో మాత్రం కచ్చితంగా నేషనల్ అవార్డుని కొల్లగొడుతాడంటూ ఆయన అభిమానులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన శివ రాజ్ కుమార్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే మొదలైన షెడ్యూల్ లో ఆయన కూడా పాల్గొన్నాడు. వరుసగా విరామం లేకుండా మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ ఏడాది లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేయాలనే టార్గెట్ తో ముందుకు పోతున్నారు. వచ్చే ఏడాది మార్చి 26 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Also Read : ఆ ఒక్క షాట్ కోసం 1000 స్టార్లు చూస్తారు…ప్రభాస్ మూవీ నెక్స్ట్ లెవల్ అంతే : రవి శంకర్…