Pedda Kapu 1 Collections: పెదకాపు 1 విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన చిత్రం. ఈ చిత్ర ప్రోమోలు భారీ ఆదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో అంచనాలకు మించి బిజినెస్ జరిగింది. అఖండ చిత్రంతో భారీ లాభాలు పొందిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పరిమితికి మించిన బడ్జెట్ తో పెదకాపు 1 నిర్మించారు. ఒక డెబ్యూ హీరోకి రూ. 10 కోట్లకు మించిన బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఏదో స్టార్ వారసుడు అంటే పెట్టొచ్చు.
అయితే కథను గట్టిగా నమ్మాము. అందుకే బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టుకోలేదని మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. పెదకాపు 1 వరల్డ్ వైడ్ రైట్స్ రూ. 12 కోట్లకు అమ్మారని సమాచారం. రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన పెదకాపు 1 ప్రీమియర్స్ ప్రదర్శన కూడా జరిగింది.
పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే రెగ్యులర్ షోలకు మాత్రం పూర్తి నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. ట్విట్టర్ లో సినిమాపై బ్యాడ్ టాక్ నడిచింది. ఆ ఎఫెక్ట్ ఫస్ట్ డే వసూళ్లపై చూపింది. ఫస్ట్ డే పెదకాపు కేవలం రూ. 30 లక్షల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఆ లెక్కన పెదకాపు 1 ఎక్కడ ఉందో అంచనా వేయవచ్చు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాకు వచ్చిన హైప్ ని క్యాష్ చేసుకోవడంలో నిర్మాతలు ఫెయిల్ అయ్యారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పెదకాపు 1 భారీ వసూళ్లు సొంతం చేసుకునేది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎన్నో ఆశలు పెట్టుకున్న కలల ప్రాజెక్ట్ దారుణ పరాజయం దిశగా అడుగులు వేస్తుంది. బ్రహ్మోత్సవం మూవీతో శ్రీకాంత్ అడ్డాల కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమయ్యాడు. నారప్ప మూవీలో కమ్ బ్యాక్ ఇచ్చాడు. అది నేరుగా ఓటీటీలో విడుదలైంది. పెదకాపు విజయం సాధిస్తే ఆయన మరలా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వచ్చేవారు. పెదకాపు రిజల్ట్ నేపథ్యంలో దీని సీక్వెల్ ఉంటుందో లేదో చూడాలి…
#PeddhaKapu1 – There was a significant difference between early premieres’ positive reviews and yesterday’s reviews. The film opened disastrous numbers with bad word-of-mouth
1st day worldwide share will be in the range of 30L !! Theatrical rights are valued at around 12.5Cr
— TrackTollywood (@TrackTwood) September 30, 2023