Indian Names For Pakistani Villages: పాలకుడు గట్టిగా ఉంటే.. దేశ విధానాలు కూడా దృఢంగా ఉంటాయని ఓ ఆఫ్రికన్ సామెత.. ఇప్పుడు ఈ సామెతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారు. 371 ఆర్టికల్ ఎత్తివేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు, విదేశీ సంస్థల పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఆ జమ్మూ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పాకిస్తాన్లోనూ పాగా వేసింది. పాగా వేయడం మాత్రమే కాదు భారత్ ఆక్రమించిన పాక్ గ్రామాలకు సరికొత్త పేర్లు పెడుతోంది. ఆ గ్రామాలు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు షెల్టర్ కావద్దు అనే ఉద్దేశంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ మేరకు ఈ వివరాలను జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ దిల్ బార్ సింగ్ విలేకరులకు వెల్లడించారు.
1971లో బంగ్లాదేశ్ తో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న భూభాగాన్ని భారత్ ఆక్రమించుకుంది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రష్యా, అమెరికా దేశాలు భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో ఆ గ్రామాలను తిరిగి పాకిస్తాన్ దేశానికి ఇవ్వాలని అప్పటి ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు వంటి వారు భారత సైన్యానికి సూచించారు. ఒకవేళ ఆ గ్రామాలను తిరిగి ఇచ్చేస్తే తీవ్రవాదులకు సురక్షితమైన ప్రాంతాలుగా మారతాయని ఉద్దేశంతో భారత సైన్యం అందుకు నిరాకరించింది. ఆ తర్వాత వాజ్ పేయి మినహా మిగతా వారంతా కాంగ్రెస్ ప్రధాన మంత్రులు కావడంతో విదేశాంగ విధానం, రక్షణ విధానం పై ఒక స్పష్టత లేకుండా పోయింది. సైన్యం చెబుతున్నప్పటికీ ఆ గ్రామాలలో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం నిరాకరిస్తూ వచ్చేది. అయితే ఈ క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సైన్యం ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చింది. ఒకవేళ భారత్ ఆక్రమించుకున్న ఆ గ్రామాలలో మౌలిక వసతులు కల్పించకపోతే అక్కడి ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, అది అంతిమంగా దేశానికి చేటు తెస్తుందని సైన్యం వివరించింది.
సైన్యం చెప్పిన మాటలను ఓపికగా విన్న నరేంద్ర మోడీ.. ఆ తదుపరి చర్యలకు సమయుత్తమయ్యారు. రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో భారత్ ఆక్రమించుకున్న గ్రామాలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రారంభించారు. ఆగకుండా ఆ గ్రామాలకు భారత్ పేర్లు పెడుతున్నారు. భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. వాస్తవంగా భారత ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంతో ఉగ్రవాదులు నెత్తి పట్టుకుంటున్నారు.