Peddanna Movie: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే.. ఒకప్పుడు కలెక్షన్ల ప్రవాహం ఉండేది. ఆ ప్రవాహంలో స్టార్ హీరోల సినిమాలు కూడా కొట్టుకుపోయేవి. కానీ ప్రస్తుతం అదంతా గతంగా మిగిలిపోయింది. రజినీ సినిమాకి పోటీగా చిన్నాచితకా హీరోలు కూడా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మరోపక్క బాక్సాఫీస్ దగ్గర మోత మోగించాల్సిన రజినీ మాత్రం కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక చేతులేత్తేస్తున్నాడు. రజినీకాంత్ సినిమాలను ఆడియన్స్ సీరియస్ గా తీసుకోవడం లేదు.

రజినీ ‘అన్నాత్తే’ తెలుగులో పెద్దన్న. ఈ సినిమా విషయంలో నిర్మాతలు భారీగా నష్టపోయారు. దీపావళీ పండగ కానుగగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ సినిమాకి తమిళంలో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడం దారుణమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.8 కోట్ల వసూళ్ళు సాధించడానికి పెద్దన్న చాలా కష్ట పడాల్సి వచ్చింది. ఆదివారం కూడా ఈ సినిమాకు కేవలం 52 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.
ఈ వసూలతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. ఎందుకంటే తెలుగులో ఈ సినిమాను 12 కోట్లకు అమ్మారు. కానీ ఆ స్థాయిలో కలెక్షన్లు లేకపోగా.. దారుణంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..
నైజాం: 1.16 కోట్లు
సీడెడ్: 0.54 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.32 కోట్లు
ఈస్ట్: 0.22 కోట్లు
వెస్ట్: 0.18 కోట్లు
గుంటూరు: 0.36 కోట్లు
కృష్ణా: 0.21 కోట్లు
నెల్లూరు: 0.17 కోట్లు
ఏపీ + తెలంగాణ: 3.16 కోట్లు షేర్ వచ్చింది. ఇక 5.40 కోట్ల గ్రాస్ వచ్చింది.
Also Read: Deepthi Sunaina : దీప్తి సునైన అందాల ఆరబోత.. చూసి తీరాల్సిందే!
అయినా 12.5 కోట్ల బిజినెస్ చేసుకుని.. నాలుగు రోజుల్లో కేవలం 3.16 కోట్లు మాత్రమే వసూళ్లు చేస్తే.. ఇక నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన పెద్దన్న ఇంకా 10 కోట్లు వసూలు చేస్తే కానీ క్లీన్ హిట్ అనిపించుకోడు. కానీ ఆ పరిస్థితి లేదు. మొత్తానికి పెద్దన్న నిర్మాతలకు కన్నీళ్లు మిగిల్చాడు.
Also Read: Nandamuri Balakrishna బాలయ్య “అన్ స్టాపబుల్” షో లో ఆ విషయం గురించి చెప్తూ ఏడ్చేసిన నాని…