Gopichand తెలుగు చిత్ర పరిశ్రమకు విలన్ గా ఎంట్రీ ఇచ్చి యజ్ఞం చిత్రంతో హీరోగా మారాడు గోపిచంద్. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇటీవల సీటీమార్ సినిమాతో మంచి మాస్ సక్సెస్ ని అందుకున్నాడు గోపీచంద్. ఆ తర్వాత ఆరడుగుల బుల్లెట్ సినిమాతో వచ్చిన అది వచ్చి వెళ్ళినట్లు కూడా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పాలి. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మారుతితో కలిసి గోపిచంద్ చేస్తున్న చిత్రం “పక్కా కమర్షియల్”. అంటూ క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు ఈ మ్యాచో హీరో. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ని ఇచ్చింది మూవీ టీమ్.
తాజాగా పక్కా కమర్షియల్ సినిమా టీజర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ‘ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం… మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ టీజర్ కి హైలైట్ అని చెప్పాలి. ఈ టీజర్ చూస్తుంటే పక్కా కమర్షియల్ అని పేరుకు తగ్గట్లుగానే సినిమా కూడా పక్కా కమర్షియల్‌గా ఉండబోతుంది అని అర్దం అవుతుంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
https://twitter.com/SKNonline/status/1457686852215840772?s=20