https://oktelugu.com/

Payal Rajput: ఆ బ్రా నాది కాదు… పాయల్ రాజ్ పుత్ బోల్డ్ కామెంట్ వైరల్

కొరడాతో కొట్టించుకుంటుంది. ఈ సీన్ పోస్ట్ చేసిన ఓ నెటిజన్... 'పాయల్ రాజ్ పుత్ బ్రా' అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ పై పాయల్ స్పందించడం విశేషం.

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2023 / 11:55 AM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: పాయల్ రాజ్ పుత్ బోల్డ్ క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 మూవీతో ఆమెకు వచ్చిన ఇమేజ్ అలా సెటిల్ అయ్యింది. అనంతరం ఆర్ డి ఎక్స్ లవ్ అనే చిత్రంలో కూడా పాయల్ గ్లామరస్ రోల్ చేసింది. ఆమెకు హోమ్లీ హీరోయిన్ పాత్రలు దక్కినా ఆ చిత్రాలు సక్సెస్ కాలేదు. డిస్కో రాజా మూవీలో మూగ అమ్మాయిగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. తాజాగా ఆమె మంగళవారం మూవీలో మరో సెన్సేషనల్ రోల్ చేసింది.

    ఈ మూవీలో ఆమె శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. వివిధ రకాల శృంగార ప్రక్రియలు ఇష్టపడే అమ్మాయిగా నటించింది. మంగళవారం మూవీలో ఓ సన్నివేశంలో పాయల్ లోదుస్తుల్లో కనబడుతుంది. కొరడాతో కొట్టించుకుంటుంది. ఈ సీన్ పోస్ట్ చేసిన ఓ నెటిజన్… ‘పాయల్ రాజ్ పుత్ బ్రా’ అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ పై పాయల్ స్పందించడం విశేషం. అసభ్యకరంగా కామెంట్ చేసిన సదరు నెటిజెన్ కి తనదైన శైలిలో కౌంటర్ వేసింది.

    ‘అది నా బ్రా కాదు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చారు’ అని రిప్లై ఇచ్చింది. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ కామెంట్ వైరల్ అవుతుంది. మంగళవారం మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. వరల్డ్ కప్ ఈ చిత్రాన్ని దెబ్బతింది. ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కావడంతో థియేటర్స్ కి ఎవరూ వెళ్ళలేదు. ఇది కలెక్షన్స్ ప్రభావితం చేసింది. సస్పెన్సు, హారర్, శృంగారం జోడించి దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం తెరకెక్కించాడు.

    ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ మాత్రమే స్టార్ క్యాస్ట్. కేవలం అజయ్ భూపతి-పాయల్ కాంబో మీద మూవీని ప్రమోట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ ఆర్ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. ఆ మూవీలో పాయల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేసింది. మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మంగళవారం హిట్ టాక్ అయితే తెచ్చుకుంది.