Telangana Elections 2023: బీఆర్‌ఎస్‌ను ఓడించబోతున్న మోడీ ‘అస్త్రం’.. గెలుపెవరిదంటే?

ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా 30 ఏళ్ల క్రితం ఎమ్మార్పీఎస్‌ ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ పుట్టక ముందే.. ఎమ్మార్పీఎస్‌ పుట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు వర్గీకరణకు ఓ ప్రయత్నం జరిగినా సుప్రీం కోర్టు తీర్పుతో ఆగిపోయింది.

Written By: Raj Shekar, Updated On : November 28, 2023 12:09 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరుగనుంది. ఈ తరుణంలో చివరి రోజు ప్రచారాన్ని మూడు ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఆఖరి మోఖాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్‌ మీడియాతోపాటు, ప్రింట్, ఎలక్ట్రాని మీడియాల్లో ప్రకటనలు మంచెత్తుతున్నాయి. అయితే ఈసారి మారిన రాజకీయ సమీకణాలు ఎవరిని ముంచుతాయో అన్న ఆందోళన మూడు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో మద్దతు తెలిపిన సామాజిక వర్గాలు.. ఈసారి మరో పార్టీకి మారిపోయాయి. గతంలో వ్యతిరేకంగా ఉన్నవారు.. ఈసారి అనుకూలంగా మారారు. ఇలాంటి పరిస్థితిలో పోయిన వారి బలమెంత.. వచ్చిన బలగమెంత అని అన్ని పార్టీలు అంచనాలు వేసుకుంటూ ప్రచారం సాగిస్తునాయి. అయితే.. గత రెండు ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన మాదిగలు ఈసారి బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించారు. దీంతో అధికార పార్టీపై ఈ ప్రభావం భారీగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గులాబీకి దూరమైన ఎమ్మార్పీఎస్‌..
ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా 30 ఏళ్ల క్రితం ఎమ్మార్పీఎస్‌ ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ పుట్టక ముందే.. ఎమ్మార్పీఎస్‌ పుట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు వర్గీకరణకు ఓ ప్రయత్నం జరిగినా సుప్రీం కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ఇక మందకృష్ణ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 2001ఏ ఏర్పడిన టీఆర్‌ఎస్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ, ఎస్సీ వర్గీకరణ జరుగలేదు. అయితే తెలంగాణలో అయినా న్యాయం జరుగుతుందని మంద కృష్ణ గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో మాదిగలంతా గులాబీ పార్టీకే ఓటేశారు. కానీ, రెండుసార్లు తమను వాడుకుని మోసం చేసిన బీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఈసారి ఎమ్మార్పీఎస్‌ నిర్ణయించింది.

బీజేపీకి మద్దతు..
గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి నష్టపోయిన ఎమ్మార్పీఎస్‌ చివరి ప్రయత్నంగా ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. అంతేకాదు.. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభకు ప్రధాని మోదీ హాజరై మాదిగలకు న్యాయం చేస్తామని ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడంతో మాదిగల్లో మార్పు కనిపిస్తోంది. ఈసారి కాషాయపార్టీకి ఓటు వేయాలని నిర్ణయించారు. ఈ ప్రభావం కచ్చితంగా అధికార బీఆర్‌ఎస్‌కు నష్టం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

కాగ్రెస్‌ను గెలిపించేది వారే..
బీఆర్‌ఎస్‌కు మాదిగలు దూరమైతే అధికార పార్టీకి తీవ్ర నష్టం జరుగడమే కాకుండా, విపక్ష కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీకి ఎమ్మార్పీఎస్‌ మద్దతు ఇచ్చినా.. ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. అధికార పార్టీ ఓటు బ్యాంకు చీలడం ద్వారా కాంగ్రెస్‌ లాభపడుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. గులాబీ పార్టీని భయపెడుతోంది. ఈతరుణంలో ఎమ్మార్పీఎస్‌ దూరమవ్వడం ఆ పార్టీ ఓటమిని కాయం చేసిందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ముంటే మాదిగల మద్దతులో బీజేపీ ఒక్క హైదరాబాద్‌లోనే ఐదు స్థానాల్లోల గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.