ట్రోలింగ్‌ కు హర్ట్ అయిన హాట్ బ్యూటీ !

‘ఆర్ ఎక్స్ 100’ అంటూ తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’ను గత రెండు మూడు రోజులుగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులోనే ఎక్కువ ప్రాజెక్ట్‌ లు చేస్తుండటంతో ఈ అమ్మడు హైదరాబాద్ షిఫ్ట్ అయినా.. మధ్యలో ముంబైకి వెళ్ళింది. పైగా ముంబై నుండి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌ కి వచ్చేసింది. అయితే ఎందుకైనా మంచిదని సెట్‌ లోనే పాయల్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించడం.. అయితే […]

Written By: admin, Updated On : June 30, 2023 5:12 pm
Follow us on


‘ఆర్ ఎక్స్ 100’ అంటూ తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’ను గత రెండు మూడు రోజులుగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులోనే ఎక్కువ ప్రాజెక్ట్‌ లు చేస్తుండటంతో ఈ అమ్మడు హైదరాబాద్ షిఫ్ట్ అయినా.. మధ్యలో ముంబైకి వెళ్ళింది. పైగా ముంబై నుండి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌ కి వచ్చేసింది. అయితే ఎందుకైనా మంచిదని సెట్‌ లోనే పాయల్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించడం.. అయితే కరోనా టెస్ట్ కి పాయల్ తెగ భయపడిపోవడం.. ఆ వీడియోను కాస్త పాయలే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అలాగే ఆ వీడియో పై నెటిజన్లు తెగ ట్రోల్ చేయడం చకచకా జరిగిపోయాయి.

Also Read: అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

ముఖ్యంగా వీడియోను, పాయల్‌ ను కలిపి ట్రోల్ చేస్తూ.. ‘రూపాయికి వంద రూపాయల యాక్షన్ చేస్తున్నావుగా… నీ ఎక్స్‌ట్రాలు ఆపు తల్లి.. అని ఒకరు, కరోనా టెస్ట్ కి కూడా ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? నిన్ను చూస్తుంటే కావాలనే అతి చేస్తున్నట్లు ఉంది అంటూ మరొకరు, ఇలా నెటిజన్లు ఇష్టమొచ్చినట్టు దారుణంగా ఈ హాట్ బ్యూటీని ట్రోలో చేస్తున్నారు. కాగా దీని పై పాయల్ స్పందిస్తూ… ‘అది నిజమని, కావాలని చేసింది కాదని తెలిపింది. భయం వేసి అలా ఏడ్చానని, తాను అలా బాధపడుతుంటే ట్రోలింగ్ చేయడం దారుణమని చెబుతూ తెగ ఫీల్ అయిపొయింది.

Also Read: పూరి విశ్లేషణ: ధనవంతులు దేశం విడిచి ఎందుకు పోతున్నారు?

పైగా సూది, ఇంజక్షన్‌ లను చూసి భయపడటం ట్రైపానోఫోబియా అని చెబుతూ.. అది ఎవ్వరికైనా ఉంటుందని.. అది సర్వ సాధారణమే అని.. దయచేసి ఎదుటి వారిని జడ్జ్ చేయడం ఆపండి అంటూ పాయల్ మొత్తానికి నెటిజన్లకు గట్టిగా క్లాస్ పీకింది. ఏమైనా ట్రోలింగ్‌కు పాయల్ పాప బాగానే హర్ట్ అయినట్టుంది. ఇక మొదటి సినిమాతో సంచలన విజయం సాధించినా పాయల్ కు, ఆ తరువాత ఆ స్థాయిలో విజయాలను గానీ, అవకాశాలు గానీ రాలేదు . మరి రాబోయే రోజుల్లోనైనా పాయల్ రాజ్ ఫుత్ కి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఓ హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.