https://oktelugu.com/

ఇస్మార్ట్ బ్యూటీస్ తో పాటు పాయల్ కూడా.. !

రవితేజ ‘క్రాక్’ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా చిత్రబృందం నభా నటేష్ నే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక […]

Written By:
  • admin
  • , Updated On : June 14, 2020 / 06:50 PM IST
    Follow us on


    రవితేజ ‘క్రాక్’ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా చిత్రబృందం నభా నటేష్ నే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

    అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్లు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం పాయల్ రాజ్ పుత్ ను అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు.

    ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా ప్లాప్ అయితే మాత్రం రవితేజ్ మార్కెట్ పూర్తిగా పడిపోతుంది. అప్పుడిక హీరోగా కొనసాగడం కష్టమే.