https://oktelugu.com/

అచ్చెన్న విషయంలో చంద్రబాబు ‘బీసీ కార్డ్’ ఎందుకు ఫెయిలైంది?

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరన్న పేరుంది. ఆయన చేతిలో బలమైన మీడియా కూడా ఉంది. అందుకే మొన్నటిదాకా అధికార వైసీపీని ఓ ఆట ఆడుకున్నారు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా.. చంద్రబాబుకు ఇప్పుడు కష్టాలొచ్చాయి. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేశాక చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బీసీ కార్డ్ వ్యూహాం ఫ్లాప్ అయ్యింది. ఈ ప్రయత్నం విఫలమైపోయింది. బీసీలందరూ ఏకమై రోడ్ల మీదకు వచ్చి నానా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2020 / 06:38 PM IST
    Follow us on


    40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తిమ్మిని బమ్మిని చేయగలరన్న పేరుంది. ఆయన చేతిలో బలమైన మీడియా కూడా ఉంది. అందుకే మొన్నటిదాకా అధికార వైసీపీని ఓ ఆట ఆడుకున్నారు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా.. చంద్రబాబుకు ఇప్పుడు కష్టాలొచ్చాయి.

    టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేశాక చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బీసీ కార్డ్ వ్యూహాం ఫ్లాప్ అయ్యింది. ఈ ప్రయత్నం విఫలమైపోయింది. బీసీలందరూ ఏకమై రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేస్తారని.. బీసీ నేతలంతా గళం విప్పుతారని.. టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేస్తారని చంద్రబాబు భావించారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ అయిన వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబుకు బీసీలపై ప్రేమ ఎక్కడికి పోయిందని వైసీపీ నేతలు అడుగుతున్నారు. ఈ ప్లాన్ ఫెయిల్ కావడంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదట..

    టీడీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయి.. ప్రతిపక్షంలోనూ వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్న అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో టీడీపీకి ఎక్కడా పెద్దగా మద్దతు లభించడం లేదు. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ అస్సలు మద్దతు లభించడం లేదు.దీన్ని బట్టి చంద్రబాబు విసిరిన బీసీ కార్డు ఘోరంగా విఫలమైందని అర్థమవుతోంది.

    జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన రెడ్డి కావడంతో చంద్రబాబు బీసీ ఫార్ములా ఇక్కడ ఎలా అప్లై చేయాలో తెలియక తెల్లమొహం వేశారు. జేసీ అరెస్ట్ తర్వాత రెడ్డిలను జగన్ టార్గెట్ చేశారని చంద్రబాబు అనలేని పరిస్థితిని జగన్ కల్పించడం విశేషం. మరీ ముఖ్యంగా వీరిద్దరి విషయంలో ఈఎస్ఐ, ట్రావెల్స్ లో అవినీతి జరగలేదని చంద్రబాబు ఇప్పటికీ బహిరంగంగా వ్యాఖ్యానించలేని పరిస్థితిలో ఉండడం గమనార్హం. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరగలేదని టీడీపీ ఇంతవరకు చెప్పలేదు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరిగిందని చంద్రబాబుకు కూడా తెలుసు అని.. అందుకే నోరుమెదపడం లేదని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

    అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత నెక్ట్స్ ఎవరు అరెస్ట్ అవుతారనే దానిపై టీడీపీలో భయం భయం నెలకొంది. ఇప్పటికే ముగ్గురు నాయకులను అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం ఇది ప్రారంభం మాత్రమేనని వైసీపీ ఎంపీ విజయసాయి, రోజా లాంటి వారు వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీడీపీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.