Pawan’s youngest son : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) నిన్న సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. నల్ల పొగ పీల్చడం వల్ల మార్క్ స్పృహ కోల్పోయాడని, ఊపిరి తిత్తుల్లో పొగ చేరడం వల్ల బార్కోస్కోపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి డేంజర్ నుండి బయటపడ్డ, నల్ల పొగ పీల్చడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన నిన్న చెప్పుకొచ్చాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొడుక్కి ఇలాంటి పరిస్థితి రావడంతో రాజకీయ ప్రఖులందరూ సోషల్ మీడియా ద్వారా స్పందించి, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్తించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఎంతో మంది ముఖ్య నాయకులూ స్పందించారు.
Also Read : పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల..!
పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ నిన్న ప్రెస్ మీట్ ద్వారా కృతఙ్ఞతలు తెలియజేశాడు. ఇకపోతే సినీ ప్రముఖుల నుండి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కాసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకొని గాయాలపాలయ్యాడని తెలిసి తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండు లిట్టిల్ వారియర్. ఈ సమయంలో ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో కానీ, బయట కానీ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఏ రేంజ్ లో కొట్లాటలు జరుగుతాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ట్వీట్ అభిమానుల మధ్య కాస్త శాంతి పూర్వక వాతవరణం నెలకొంది.
పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ అతను ఒక గొప్ప నటుడు అని కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. అరవింద సమేత మూవీ ఓపెనింగ్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ ని కొట్టాడు. అంతకు ముందు కూడా వీళ్లిద్దరు రామ్ చరణ్ నిశ్చితార్థం సమయంలో క్లోజ్ గా మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా వీళ్లిద్దరు కలిసిన సందర్భాలు తక్కువే అయినా అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుని రేంజ్ జ్ఞాపకాలను అందించారు. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలుగా పిలవబడే వీళ్లిద్దరు కలిసి భవిషత్తులో సినిమా చేస్తారో లేదో తెలియదు కానీ, ఒకవేళ చేస్తే మాత్రం ప్రభంజనమే అని చెప్పొచ్చు.
Also Read : వారానికి 43 వేల ఫీజు.. ఏం నేర్పిస్తారంటే? సింగపూర్ స్కూల్ లో జరిగింది ఇదే!
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025