Pawan Kalyan Son : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar Pawanovich) నిన్న సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నిన్న మీడియా సమావేశం లో మాట్లాడుతూ చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని అనుకున్నాను కానీ, ఇంతపెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందని, 15 మంది చిన్నారులు గాయాలపాలయ్యారని, మార్క్ పక్కన కూర్చున్న అమ్మాయి చనిపోయిందని, మార్క్ చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయని, నల్ల పొగ పీల్చడం వల్ల బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ చేస్తున్నారని, ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి(Megastar Chiranjeevi) దంపతులు కూడా సింగపూర్ కి ప్రత్యేక విమానం లో బయలుదేరారు.
Also Read : వారానికి 43 వేల ఫీజు.. ఏం నేర్పిస్తారంటే? సింగపూర్ స్కూల్ లో జరిగింది ఇదే!
ఇకపోతే కాసేపటి క్రితమే మార్క్ శంకర్ కి సంబంధించిన హెల్త్ అప్డేట్ ని మీడియా కి విడుదల చేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ నేడు ఉదయం వైద్యులను మార్క్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, మార్క్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నారని, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం బుధవారం ఉదయం మార్క్ ని ICU వార్డు నుండి జనరల్ వార్డ్ కి తరలించారని , మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పినట్టు మీడియా కి సమాచారం అందించింది జనసేన పార్టీ. ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కోలుకుంటాడు అనే వార్త వినగానే అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. నిన్న మార్క్ కి ప్రమాదం జరిగింది అనే వార్త వచ్చినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేయించారు.
ఇదంతా పక్కన పెడితే మార్క్ శంకర్ పక్కనే కూర్చున్న అమ్మాయి థర్డ్ డిగ్రీ బుర్న్స్ తో చనిపోవడం పై పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారులకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నారు. అంతటి ఘోరప్రమాదం నుండి మార్క్ శంకర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడడం దేవుడి కృపకు నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మార్క్ కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తనతో పాటు ఇండియా కి తీసుకొస్తాడా?, లేకపోతే సింగపూర్ లోనే ఉంచుతాడా అనేది తెలియాల్సి ఉంది. సోమవారం లోపు పవన్ క్లయం ఇండియా కి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాలుగు రోజుల పాటు గిరిజన గ్రామాల్లో పర్యటించడానికి సిద్దమైన పవన్ కళ్యాణ్ రెండు రోజులు పూర్తి చేసుకున్న వెంటనే ఈ ఘటన జరగడంతో సింగపూర్ కి హుటాహుటిన బయలుదేరాడు. మళ్ళీ ఇండియా కి తిరిగి రాగానే పర్యటన కొనసాగిస్తాడని తెలుస్తుంది.
Also Read : హీరో అవుతాడు అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అకిరా నందన్.. తొలి సినిమా మ్యూజిక్ అదిరింది