సంక్రాంతికి టీజర్లతో రానున్న పవన్, ప్రభాస్ !

సంక్రాంతి హడావుడి మొదలైపోయింది. అందుకే స్టార్ హీరోల సినిమాల నుండి అభిమానులకు సర్‌ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వకీలసాబ్ టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్స్ అయింది. నిజానికి, ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్‌ ను న్యూ ఇయర్ రోజున రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరిగినా.. వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం టీజర్ విడుదలను పొంగల్ కి ఫిక్స్ చేశారట. మరోపక్క పవన్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ కోసం ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also […]

Written By: Neelambaram, Updated On : December 28, 2020 6:39 pm
Follow us on


సంక్రాంతి హడావుడి మొదలైపోయింది. అందుకే స్టార్ హీరోల సినిమాల నుండి అభిమానులకు సర్‌ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వకీలసాబ్ టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్స్ అయింది. నిజానికి, ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్‌ ను న్యూ ఇయర్ రోజున రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరిగినా.. వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం టీజర్ విడుదలను పొంగల్ కి ఫిక్స్ చేశారట. మరోపక్క పవన్ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ కోసం ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ‘ఆచార్య’లో మెగాస్టార్ తో మెహబూబ్!

ఇక వకీల్ సాబ్ మరో వారం రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని… జనవరి 2న నుండి షూట్ మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ షెడ్యూల్ వేశారు. అన్నట్టు ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి.. ఆ తరువాత వెంటనే క్రిష్ తో చేస్తోన్న సినిమాను కూడా మొదలుపెడతాడట పవన్. క్రిష్ – పవన్ సినిమాను వచ్చే విజయదశమి పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట.

Also Read: “షకీలా” సినిమా ఎలా ఉందంటే ?

అలాగే వచ్చే ఏడాది వేసవికే సిద్ధమవుతున్న ప్రభాస్ `రాధేశ్యామ్` నుంచి కూడా ఓ సర్‌ప్రైజ్ రాబోతోందట. ఈ సినిమా టీజర్ ను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ – తమిళ- కన్నడ భాషా చిత్రంగా తెర‌కెక్కించి అటు పై దేశంలోని మిగిలిన అన్ని భాష‌ల్లోనూ.. జపాన్, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని ఇప్పటికే మేకర్స్ అన్ని రకాలుగా సన్నధం అవుతున్నారు. అందుకే టీజర్ ను సంక్రాంతికే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్