https://oktelugu.com/

మీరు వ్యాపారాలు వదిలేయండి.. నేను సినిమాలు వదిలేస్తా: పవన్

పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడని.. సినిమాలు చేసుకుంటున్నాడనే విమర్శలపై జనసేనాని ఘాటుగా స్పందించాడు. తాను సినిమాలు చేస్తున్నానని విమర్శిస్తున్న వైసీపీ నేతలు వారి వ్యాపారాలు వదిలేసి వస్తే నేనూ సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తానని విమర్శించాడు. ఓడిపోయినా ప్రజల కోసం వచ్చానని.. భయపడితే పనులు కావని పవన్ స్పష్టం చేశారు. మాకు భయాల్లేవని క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చారని.. అదే రైతులు చనిపోతే రూ.7 లక్షలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2020 / 05:08 PM IST
    Follow us on

    పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడని.. సినిమాలు చేసుకుంటున్నాడనే విమర్శలపై జనసేనాని ఘాటుగా స్పందించాడు. తాను సినిమాలు చేస్తున్నానని విమర్శిస్తున్న వైసీపీ నేతలు వారి వ్యాపారాలు వదిలేసి వస్తే నేనూ సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తానని విమర్శించాడు. ఓడిపోయినా ప్రజల కోసం వచ్చానని.. భయపడితే పనులు కావని పవన్ స్పష్టం చేశారు. మాకు భయాల్లేవని క్లారిటీ ఇచ్చారు.

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చారని.. అదే రైతులు చనిపోతే రూ.7 లక్షలు ఇస్తారా? అని ఏపీ సర్కార్ ను పవన్ ప్రశ్నించారు.151మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాతో అడ్డగోలుగా దోచేయడానికా? అని పవన్ విమర్శించారు.

    మంత్రి పేర్ని నానిపై పవన్ సెటైర్లు పేల్చారు. సీఎం సాబ్ కు వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండని.. నివర్ తుఫాన్ బాధిత రైతులకు నష్టపరిహారంగా రూ.10వేలు చొప్పున వెంటనే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోపు ఇవ్వకుండా అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ హెచ్చరించారు.

    ఈ సందర్భంగా కృష్ణ జిల్లా మచిలీపట్నంలో నివర్ తుఫాన్ బాధిత ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. రైతులకు అండగా ఉండి వారి సమస్యలపై పోరాడుతామని పవన్ హామీ ఇచ్చారు.