https://oktelugu.com/

నేను లోకల్ అంటున్న పవన్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీతో బీజీగా ఉన్నారు. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలకు కమిట్ అవుతూ బీజీగా మారాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్ ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. పవన్ ఈ మూవీ చేస్తూనే డైరెక్టర్ క్రిష్ తో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొగల్ సామ్రాజ్యం కథాంశంతో ఈ […]

Written By: , Updated On : May 19, 2020 / 04:15 PM IST
Follow us on


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీతో బీజీగా ఉన్నారు. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలకు కమిట్ అవుతూ బీజీగా మారాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్ ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. పవన్ ఈ మూవీ చేస్తూనే డైరెక్టర్ క్రిష్ తో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొగల్ సామ్రాజ్యం కథాంశంతో ఈ మూవీని క్రిష్ తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్లో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. ఇప్పట్లో సినిమా షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. దీంతో దర్శకుడు క్రిష్, పవన్ మూవీకి సంబంధించిన లోకేషన్లలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూన్లో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఈమేరకు షూటింగులు ప్రారంభమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈమేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతి లేకపోవడంతో సినిమాలను వీలైనంత వరకు లోకల్ గానే పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈనేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ తాను పవన్ కల్యాణ్ తో తీయబోయే పీరియాడికల్ మూవీకి సంబంధించిన సెట్స్ అన్ని కూడా హైదరాబాద్లోని రామెజీ ఫిల్మ్ సిటీలే వేయించేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. 90శాతం షూటింగ్ హైదరాబాద్ లోకేషన్లలోనే పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారట. అలాగే ‘వకీల్ సాబ్’ చిత్రానికి సంబంధించిన మిగతా షూటింగ్ కూడా హైదరాబాద్లోనే పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ సినిమాలన్నీ స్థానికంగానే పూర్తి కానున్నాయి. ఈ మూవీల తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.