మోడీ చేతిలోకి ఒక ఆయుధంగా కరోనా.!

నాలుగు నెలల క్రితం దేశవ్యాప్తంగా నిరసనలు.. మోడీపై విమర్శలు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో కృంగిపోయిన కమలదళం.. హర్యానాలో చావుతప్పి కన్నులొట్టబోయింది.పైగా సీఐఐ వ్యతిరేక ఆందోళనలతో మోడీ విలన్ గా మారిపోయాడు. కరోనాకు ముందు.. నిజంగా మోడీ పతనం ప్రారంభమైందని అంతా అనుకున్నారు. కానీ కరోనా వచ్చాక మోడీ దేశాన్ని ఏకం చేశాడు. ప్యాకేజీ విషయం పక్కనపెడితే కేసులు పెరగకుండా నిరోధించడంలో గొప్ప విజయం సాధించాడని చెప్పవచ్చు. *కరోనా సంక్షోభంతో మోడీ హీరో తాజా కరోనా […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 4:24 pm
Follow us on


నాలుగు నెలల క్రితం దేశవ్యాప్తంగా నిరసనలు.. మోడీపై విమర్శలు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో కృంగిపోయిన కమలదళం.. హర్యానాలో చావుతప్పి కన్నులొట్టబోయింది.పైగా సీఐఐ వ్యతిరేక ఆందోళనలతో మోడీ విలన్ గా మారిపోయాడు. కరోనాకు ముందు.. నిజంగా మోడీ పతనం ప్రారంభమైందని అంతా అనుకున్నారు. కానీ కరోనా వచ్చాక మోడీ దేశాన్ని ఏకం చేశాడు. ప్యాకేజీ విషయం పక్కనపెడితే కేసులు పెరగకుండా నిరోధించడంలో గొప్ప విజయం సాధించాడని చెప్పవచ్చు.

*కరోనా సంక్షోభంతో మోడీ హీరో
తాజా కరోనా సంక్షోభం నిజంగానే దేశంలో మోడీని హీరోను చేసింది. ఆయన ఒక్క ‘జనతా కర్ఫ్యూ’ నినాదం ఇస్తే అందరూ పాటించేలా చేసింది. రెండు నెలలుగా లాక్ డౌన్ విధిస్తే కిక్కురుమనుకుండా అందరూ ఇంట్లోనే ఉన్నారు. మధ్యలో చప్పట్లు కొట్టమన్నారు. దీపాలు వెలిగించమన్నారు. సీఎంల నుంచి సాధారణ ప్రజలదాకా దేశమంతా ఒక్కటై ఈ పనిచేసింది. మోడీని ఫాలో అయ్యింది. నిజంగానే ఆయనను హీరోను చేసింది.

*మోడీ ముందుచూపు
కరోనా వ్యాప్తిని ముందుగానే గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ సాహసోపేతమైన గొప్పనిర్ణయం తీసుకున్నారు. 130 కోట్ల మంది ప్రజలున్న భారతంలో కంట్రోల్ చేశాడు. చైనాతోపాటు ప్రపంచదేశాలకు విమానాలను నిషేధించాలన్న మోడీ నిర్ణయం బాగా పనిచేసింది. సకాలంలో తీసుకున్న నిర్ణయాలు.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేయాలన్న మోడీ నిర్ణయం బాగా పనిచేసింది. ఇక లాక్ డౌన్ లు అమలు చేసిన విధానం కూడా జనామోదం దక్కింది.

*విదేశాలతో పోలిస్తే భారత్ ను నిలబెట్టిన మోడీ
సమాయానుకూలంగా మోడీ తీసుకున్న నిర్ణయాలు భారతదేశంలో కరోనా కేసులు తగ్గించడంలో నిజంగా సహాయపడ్డాయి. అదే అమెరికా, ఇటలీ, యూరప్ దేశాల్లో మరణ మృదంగం వినిపించి ఇప్పటికీ కరోనాను కంట్రోల్ చేయలేని దుస్థితిలోకి ఆ దేశాలు వెళ్లిపోయాయి. అమెరికా సహా అనే దేశాల కంటే భారతదేశం కరోనాపై మెరుగ్గా పనిచేసిందని చెప్పవచ్చు. మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా ప్రస్తుతానికి దేశానికి అంతో ఇంతో మేలు చేసిందనే చెప్పవచ్చు.

*నాటి సీఏఏ మచ్చ తొలిగినట్లే
సీఏఏ అల్లర్లతో మోడీపై మతముద్ర.. హిందుత్వ రాజకీయ ముద్ర పడి ఆయనను రాజకీయంగా దెబ్బతీసింది. ఇప్పుడు వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో విశేషంగా కృషి చేసినందున సీఏఏ వ్యతిరేక అల్లర్ల మచ్చ మోడీపై చెరిగిపోయింది. మోడీ చేతిలోకి కరోనా ఒక ఆయుధంగా వచ్చిందనే చెప్పాలి. సీఏఏతో మోడీని బుక్ చేద్దామని చూసిన దేశంలోని ప్రతిపక్షాలు.. కమ్యూనిస్టులు, మైనార్టీల ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కానీ మోడీ దాన్ని ఆయుధంగా చేసుకొని రాళ్లేసిన వారితోనే పూలు వేసుకున్న చందంగా మార్చుకోవడం నిజంగానే విశేషం మరీ..

–నరేశ్ ఎన్నం