https://oktelugu.com/

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి.

Written By: , Updated On : December 2, 2024 / 06:07 PM IST
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Follow us on

Ustaad Bhagat Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు.అయితే ఒకప్పుడు పెను ప్రభంజనాన్ని సృష్టించిన పవన్ కళ్యాణ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకోవడంలో ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఇలాంటి నటుడు చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యనైతే సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఆయన నుంచి సినిమా ఎప్పుడు రాబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా ఒకప్పుడు మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న సమయాన ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నప్పటికి ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ముందుకు సాగుతున్నాడు. ఇక సెట్స్ మీద ఉన్న సినిమాలను ముందుగా పూర్తి చేయాలనే ధోరణిలో తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 70% షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని మిగతా 30% షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎప్పుడు డేట్ ఇస్తాడు అనే దాని మీదనే హరీష్ శంకర్ చాలా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక దీంతో పాటుగా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ సెట్స్ మీద ఉంచాడు.

ఇక వాటిని కూడా తొందర్లోనే ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూడు సినిమాల్లో ఏది మొదటగా థియేటర్లోకి రాబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన ఏ సినిమాకి తన డేట్స్ ని కేటాయిస్తాడు తద్వారా ఏ సినిమాని ముందుగా పూర్తి చేసి థియేటర్లోకి తీసుకొస్తాడనేది తెలియాల్సి ఉంది.

మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కోసమే దర్శక నిర్మాతలు అందరూ వెయిట్ చేస్తున్న సందర్భంలో ఆయన మాత్రం ఆ సినిమాల కోసం ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ మూడు సినిమాల్లో 2025 సంవత్సరంలో దాదాపు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…