Senior Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయి ప్రస్తుతం ప్రపంచ స్థాయికి వెళ్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. రాజమౌళి లాంటి దర్శకుడు మొదట ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని ప్రత్యేకంగా నిలిపాడు. ఇక ఆ తర్వాత ప్రతి దర్శకుడు కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న నేపధ్యంలో కొంతమంది యంగ్ డైరెక్టర్స్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఒకప్పటి సీనియర్ డైరెక్టర్లు మాత్రం ఇప్పుడు సినిమాలు చేయడంలో కొంతవరకు వెనుక బడిపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు సరైన సక్సెస్ లను అందుకోకపోవడం వల్ల స్టార్ హీరోలు ఎవరు వాళ్ళకి డేట్స్ అయితే ఇవ్వడం లేదు. దాని వల్ల వాళ్ళు విపరీతంగా సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే 2025వ సంవత్సరంలో ఒక ఇద్దరు దర్శకులు కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పూరీ జగన్నాధ్
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను తీసి మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్…ఇక ఇప్పుడు తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. మరి మొత్తానికైతే ఆయన ఎప్పుడు డౌన్ అయిన కూడా మరొకసారి లేచి బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాడు. మరి ఈసారి కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్లాప్ అయింది.
మరి ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఆయన తన తదుపరి సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో 2025లో కంబ్యాక్ ఇస్తానంటూ చాలా స్ట్రాంగ్ గా చెబుతూ ఉండటం విశేషం…
మురుగదాస్
తమిళ్ డైరెక్టర్ అయిన మురుగదాస్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ ఆయనకు పెద్దగా సక్సెస్ లైతే రావడం లేదు. గతంలో స్టార్ హీరోలందరితో వరుస సక్సెస్ లను అందించిన ఆయన ఇప్పుడు మాత్రం తన మ్యాజిక్ ని రిపీట్ చేయడంలో కొంతవరకు తడబడుతున్నాడు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి బౌన్స్ బ్యాక్ అవుతానని చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…