Abhishek Bachchan : ఇప్పుడు అతని మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను ‘పెళ్లి చేసుకున్న పురుషులకు’ సలహా ఇవ్వడం కనిపిస్తుంది. ఈ వీడియో గత రాత్రి ముంబైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2024 నుండి వచ్చింది. ఇందులో అతను వివాహిత పురుషులకు ఫన్నీగా సలహా ఇస్తూ , ‘మీ భార్య ఏది చెబితే అది చేయండి!’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అభిషేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్, ఐశ్వర్యల విడాకుల వార్తలు వస్తున్న తరుణంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘‘మీ ప్రదర్శనలతో విమర్శకులను ఎలా సైలెంట్ చేస్తున్నారు? అది మీకు ఎలా సాధ్యమవుతుంది’’ అని హొస్ట్ అభిషేక్ బచ్చన్‌ను ప్రశ్నించాడు. దీనిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా సాధారణమైన విషయం. మాపై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోను. దర్శకులు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాను. మన పనేదో మనం చేసుకుని కాస్త సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోవడమే’’ అని ఆయన బదులిచ్చారు. దీనిపై హోస్ట్ స్పందిస్తూ.. ‘‘ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా. నా భార్య ఏం చెప్పినా వింటా’’ అంటూ నవ్వులు పూయించాడు. అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘అవును నిజం.. పెళ్లైన పురుషులు కచ్చితంగా తమ భార్య మాట వినాలి’’ అంటూ సమాధానమిచ్చారు. అభిషేక్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు వస్తోన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.
అభిషేక్ – ఐశ్వర్యల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో నిజం లేదని అభిషేక్ ఇప్పటికే కొన్ని సార్లు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నానంటే అది నిజంగా నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఐశ్వర్య ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ విషయంలో తనకు కృతజ్ఞతలు చెబుతున్నా’’ అంటూ అభిషేక్ అన్నారు. మరోవైపు, ఇటీవల ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అందులో ఆమె పేరును బచ్చన్ లేకుండా ఉపయోగించారు. దాంతో ఈ వార్తలు మరోసారి ఈ వార్తలకు ఊతం ఇచ్చినట్లు అయింది. అభిషేక్ నటించిన తాజా చిత్రం ‘ఐ వాంట్ టు టాక్’. సూజిత్ సర్కార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆయన అర్జున్ పేరు గల తండ్రి పాత్రలో నటించారు. ఇటీవల విడుదలై ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చింది.
వీరి విడాకుల పుకారు ఎలా మొదలైంది?
వీరి విడాకుల పై కొందరు మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం ఇంకా కలిసి ఉన్నారని అంటున్నారు. కొంతకాలం క్రితం, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వారిద్దరూ విడివిడిగా వచ్చారు, ఆ తర్వాత వారి సంబంధంలో విబేధాలు వచ్చాయని ముఖ్యాంశాలలోకి వచ్చింది. అభిషేక్ తన కుటుంబంతో కలిసి పెళ్లికి రాగా, ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో వచ్చింది. ఇది కాకుండా, ఆరాధ్య పుట్టినరోజున బచ్చన్ కుటుంబంలోని సభ్యులు ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత ఈ ఊహాగానాలు తీవ్రమయ్యాయి. అయితే ఈ వార్తలపై ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందన లేదు.