https://oktelugu.com/

వైరల్ అవుతోన్న పవన్ లాస్ట్ డే షూట్ ఫోటోలు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” షూటింగ్ మొత్తానికి పూర్తి అయింది. ఈ సినిమా షూటింగ్ చివరి రోజున పవన్ చిత్ర దర్శకుడితోపాటు, చిత్ర యూనిట్ సభ్యులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‏ అవుతున్నాయి. ఏది ఏమైనా పవన్ సినిమా పూర్తికావడంతో పవర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరగా తమ అభిమాన కథానాయకుడి సినిమాని థియేటర్ లో చూడొచ్చు అని పవన్ ఫ్యాన్స్ ఆనందం.. మరి వారి ఆనందాన్ని ఎప్పుడు […]

Written By: , Updated On : December 30, 2020 / 11:27 AM IST
Follow us on

Pawan Kalyan Viral Photo

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” షూటింగ్ మొత్తానికి పూర్తి అయింది. ఈ సినిమా షూటింగ్ చివరి రోజున పవన్ చిత్ర దర్శకుడితోపాటు, చిత్ర యూనిట్ సభ్యులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‏ అవుతున్నాయి. ఏది ఏమైనా పవన్ సినిమా పూర్తికావడంతో పవర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరగా తమ అభిమాన కథానాయకుడి సినిమాని థియేటర్ లో చూడొచ్చు అని పవన్ ఫ్యాన్స్ ఆనందం.. మరి వారి ఆనందాన్ని ఎప్పుడు వాస్తవికత అనుభూతి చెందుతారో చూడాలి.

Also Read: తోడేలులా మారబోతోన్న బన్నీబాబు !

అన్నట్టు ఈ సినిమాలో పవన్ లుక్ ‏కు అభిమానులు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాని రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ, థియేటర్ల వ్యాపారం జనవరి కల్లా పుంజుకోదు కాబట్టి, సినిమా సమ్మర్ కి వాయిదా వేయాలని మేకర్స్ భావించారు. అయితే, జనం థియేటర్లుకు భారీ ఎత్తున రావడంతో.. ఇక వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని దిల్ రాజు థియేటర్లను ఇప్పటినుండే సెట్ చేయడానికి సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్ కి విలన్ గా సూపర్ స్టార్ ఫిక్స్ !

మరోపక్క ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ అవొచ్చు అనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా అలరించబోతుంది. ఏది ఏమైనా ఈ సినిమా పై మాత్రం పవన్ ఫ్యాన్స్ ముందు నుండి బాగా ఆసక్తిగా ఉన్నారు. అన్నట్లు ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ అండ్ హరీష్ శంకర్ సినిమాల్లో నటించనున్నాడు. మెయిన్ గా హరీష్ శంకర్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్