తోడేలులా మారబోతోన్న బన్నీబాబు !

అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం బన్నీ బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే లుక్ ను మార్చిన బన్నీ.. తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం తోడేలులా ఎలా పరిగెత్తాలో ఎలా దాడి చేయాలో నేర్చుకుంటున్నాడట. అంటే బన్నీ ఎక్కువగా అడవిలో ఉంటాడు కాబట్టి, తోడేలులా అడ్డు వచ్చిన వారి పై దాడి చేస్తాడట. మరి చూడాలి సుకుమార్, ఈ ఫైట్ ను ఎలా కొత్తగా ప్లాన్ చేశాడో. ఇక ‘రంగస్థలం’ చిత్రం […]

Written By: Neelambaram, Updated On : December 30, 2020 11:49 am
Follow us on


అల్లు అర్జున్ చేస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం బన్నీ బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే లుక్ ను మార్చిన బన్నీ.. తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం తోడేలులా ఎలా పరిగెత్తాలో ఎలా దాడి చేయాలో నేర్చుకుంటున్నాడట. అంటే బన్నీ ఎక్కువగా అడవిలో ఉంటాడు కాబట్టి, తోడేలులా అడ్డు వచ్చిన వారి పై దాడి చేస్తాడట. మరి చూడాలి సుకుమార్, ఈ ఫైట్ ను ఎలా కొత్తగా ప్లాన్ చేశాడో. ఇక ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ రెండేళ్లపాటు నిరీక్షించి బన్నీతో ఈ సినిమా కమిటయ్యాడు. పైగా బన్నీ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను డిజైన్ చేశాడట.

Also Read: ఎన్టీఆర్ కి విలన్ గా సూపర్ స్టార్ ఫిక్స్ !

దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ లో బన్నీ అడవి నేపథ్యంలో పూర్తి రఫ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడు. అన్నట్టు అట్టహాసంగా ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడం, ఆ తరువాత టీమ్ మెంబర్స్ కి కరోనా రావడంతో సినిమాకి బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా కేరళలోని అడవుల్లో చిత్రీకరణ పెట్టబోతున్నారని తెలుస్తోంది. వచ్చే వారం తర్వాత షూట్ మొదలుకానుంది. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువగా అడవుల్లోనే జరపాల్సి ఉంది.

Also Read: వైరల్ అవుతోన్న పవన్ లాస్ట్ డే షూట్ ఫోటోలు !

అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా.. కాస్త అందమైన లొకేషన్స్ కోసం కేరళలో షూట్ చేయాలని ఫిక్స్ ఆయారు. అలాగే వైజాగ్లో కొంత భాగం చిత్రీకరణను జరపాలనుకుంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో విశాఖకు వెళ్తారట. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ రెడ్ శాండల్ స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ డీగ్లామర్ లుక్ చేసుకున్నారు బన్నీ. భారీ బడ్జెట్ కేటాయించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ రష్మీక కథానాయకిగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్