spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan And Vijay: పవన్ కళ్యాణ్ తో మాట్లాడటానికి ట్రై చేస్తున్న దళపతి విజయ్...మీటింగ్...

Pawan Kalyan And Vijay: పవన్ కళ్యాణ్ తో మాట్లాడటానికి ట్రై చేస్తున్న దళపతి విజయ్…మీటింగ్ ఎప్పుడంటే..?

Pawan Kalyan And Vijay: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధికమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం తను పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి సినిమాల మీద ఉన్న ఇష్టం అలాగే తన అభిమానులు తనను స్క్రీన్ మీద చూడాలనుకునే ప్రేమను గుర్తించుకొని మరి పవన్ కళ్యాణ్ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూనే వస్తున్నాడు…

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు తీసుకెళ్తుండటం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో అయిన దళపతి విజయ్ సైతం పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇచ్చాడు. అయితే అతన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే అతనికి బిజెపి నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి.

కానీ ఆయన దేని వైపు మొగ్గు చూపడం లేదు. ఇక ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఒకసారి పవన్ కళ్యాణ్ ని కలిసి అతని సజెషన్స్ తీసుకోవాలని విజయ్ అనుకుంటున్నాడట. నిజానికి పవన్ కళ్యాణ్ కి విజయ్ కి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరు కెరియర్ స్టార్టింగ్ లో కూడా చాలా బాగా మాట్లాడుకునేవారు. విజయ్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన కూడా పవన్ కళ్యాణ్ ను కలిసి వెళ్తానని గతంలో ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైతం ఎన్డీఏ కూటమిలో భాగమవుతున్నాడు.

కాబట్టి విజయ్ ని సైతం ఎన్డీఏ కూటమిలో చేరుస్తాడా? విజయ్ అడగబోయే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నాడు. విజయ్ – పవన్ కళ్యాణ్ తో ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…మొత్తానికైతే విజయ్ ను సైతం ఎన్డీఏ కూటమిలో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular