Ustaad Bhagat Singh sensational video : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాన్ని ప్రకటించి చాలా ఏళ్ళు అయ్యింది. ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రమిది. ఆయనకు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా కాలం వరకు షూటింగ్ ఆగిపోయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం చేసుకొని వచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇంత చెత్తగా ఈ చిత్రాన్ని తీసాడు, రేపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా తీస్తాడో అని అభిమానులు కాస్త భయపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ సబ్జెక్టు అంటే హరీష్ శంకర్ ప్రాణం పెట్టి పని చేస్తాడని విడుదలైన రెండు గ్లింప్స్ వీడియోస్ తోనే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రివ్యూ: గ్లాసంటే సైజు కాదు సైన్యం, జగన్ పై పవన్ పంచ్లు, టీజర్ కేక!
ఇకపోతే నిన్ననే పవన్ కళ్యాణ్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే మేకర్స్ ఒక వీడియో ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న చిన్న చిన్న గ్లింప్స్ షాట్స్ ని పెట్టి అభిమానులను మెంటలెక్కిపోయేలా చేశారు. పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ తో ఊగిపోతున్నారు. ఇది కదా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే, కచ్చితంగా హరీష్ శంకర్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తాడని, రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా ఓజీ మూవీ క్రేజ్ ని కూడా డామినేట్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియో లో కొన్ని షాట్స్ లో శ్రీలీల కూడా ఉంది. నిన్న వాళ్ళిద్దరి మధ్యనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి అయ్యేలా కనిపిస్తుంది. అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరుగుతుందట. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం 50 నుండి 60 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడట. ఈ సినిమా మొదలైన రోజే ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం తేరి కి రీమేక్ అని ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, ఇప్పుడు ఫ్రెష్ సబ్జెక్టు తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అంటున్నారు. సినిమా షూటింగ్ చాలా వేగంగా అయిపోతుంది కాబట్టి ఈ చిత్రాన్ని సంక్రాంతి కి దింపే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్. కానీ అదే సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం కూడా విడుదల అవుతుంది. అన్నదమ్ముల సినిమాలు ఒకే టైం లో విడుదల కావు కాబట్టి సమ్మర్ కి విడుదల చేసే ఆలోచనలు కూడా ఉన్నాయట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది
Iss baar sirf Aandhi nahin, toofan hain
POWER STAR @PawanKalyan joins the sets of #UstaadBhagatSingh ❤
Shoot in progress. Stay tuned for more updates.
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @MythriOfficial… pic.twitter.com/817bJiof5M— Ustaad Bhagat Singh (@UBSTheFilm) June 11, 2025