https://oktelugu.com/

పవన్ -త్రివిక్రమ్ సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు..’!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ.. సినిమాల్లోనూ బీజీగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేనాని కొంత సమయాన్ని సినిమాలకు కూడా కేటాయిస్తున్న సంగతి తెల్సిందే. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలకు పవన్ కమిట్ అవడంతో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ ! పవన్ కల్యాణ్ రీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 10:36 AM IST

    Pawan-kalyan-Trivikram

    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ.. సినిమాల్లోనూ బీజీగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేనాని కొంత సమయాన్ని సినిమాలకు కూడా కేటాయిస్తున్న సంగతి తెల్సిందే. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలకు పవన్ కమిట్ అవడంతో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

    పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ మూవీని తెలుగులో నిర్మాతలు దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. పవన్ తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి టీజర్, ఫస్టు లుక్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

    ఈ మూవీ తర్వాత పవన్-క్రిష్ కాంబోలో #PSPK 27 MOVIE రానుంది. పవన్ తొలిసారి పీరియాడికల్ మూవీలో నటిస్తుండటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇందులో పవర్ స్టార్ బందిపోటుగా నటిస్తాడనే టాక్ విన్పిస్తోంది. అదేవిధంగా పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్ #PSPK 28 MOVIE రానుంది. వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. దీంతోపాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుందని ప్రచారం జరుగుతోంది.

    ఇక పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచాయి. ‘జల్సా’.. ‘అత్తారింటికిదారేది’ మూవీలో అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. పవన్ కల్యాణ్ చివరి చిత్రం ‘అజ్ఞాతవాసి’పై అంచనాలు ఎక్కువ కావడంతో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ సినిమా బాగానే కలెక్షన్లు రాబట్టిందని సమాచారం.

    Also Read: ఒక్క శ్రావణి.. ముగ్గురు నిందితులు..

    ఇక వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ మూవీ రాబోతుందని టాక్ విన్పిస్తోంది. సినిమా ఎప్పుడంటే మాత్రం ‘ఆ ఒక్కటి అడక్కు..’ అన్న డైలాగ్ టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది. పవన్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తికావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టేలా కన్పిస్తోంది. త్రివిక్రమ్ వేరే హీరోలతో సినిమాలకు కమిట్ అయ్యాడు. దీంతో ఇప్పట్లో వీరి కాంబినేషన్ ఇప్పట్లో సినిమా రాకపోవచ్చు. అయితే అన్ని అనుకున్నట్లు కుదిరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందుగానీ లేదా ఆ తర్వాతగానీ పవన్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.