https://oktelugu.com/

మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమా లేక ఖాళీగా ఉన్న వినాయక్ కి మెగాస్టార్ పిలిచి మరీ ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారు. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత ఆకుల శివతో డైలాగ్స్ రాయిస్తున్నాడు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2020 / 10:25 AM IST
    Follow us on


    మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమా లేక ఖాళీగా ఉన్న వినాయక్ కి మెగాస్టార్ పిలిచి మరీ ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారు. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత ఆకుల శివతో డైలాగ్స్ రాయిస్తున్నాడు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటించబోతుంది. నిజానికి ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో హీరోయిన్ రోల్ లేదు. మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఓ మాస్ సాంగ్ కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారు. ఇక వినాయక్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడనగానే ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇలాంటి స్క్రిప్ట్ లను హ్యాండిల్ చేయడంలో వినాయక్ స్పెషలిస్ట్. పైగా వినాయక్ కసితో ఉన్నాడు, ఎలాగైనా హిట్ కొట్టాలని.

    Also Read: ఒక్క శ్రావణి.. ముగ్గురు నిందితులు..

    కాబట్టి ఈ సినిమా సక్సెస్ కోసం వినాయక్ తన శాయశక్తులను పెడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి వినాయక్ బాలయ్య బాబుతో ఓ సినిమాని ప్లాన్ చేసాడు, కథ నచ్చలేదు అని బాలయ్య, బోయపాటి సినిమా మీదకు వెళ్లడంతో ఇక వినాయక్ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తరువాత వినాయక్, రవితేజతో కూడా మరో సినిమా అనుకున్నా.. బడ్జెట్ కారణంగా ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయి.. వినాయక్ కు డైరెక్టర్ గా సినిమా లేకుండా చేసింది. దానికి తగ్గట్లు ఈ లోపే తానే హీరోగా వినాయక్ కి ఒక సినిమా రావడం.. దాంతో వినాయక్ కూడా యాక్టింగ్ వైపు ఆసక్తి చూపించి.. ఆ సినిమా చేస్తుండటంతో డైరెక్టర్ గా వినాయక్ కి చాలా గ్యాప్ వచ్చేసింది. దాంతో ఏ స్టార్ హీరో పిలిచి వినాయక్ కి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయే సరికి ఇక వినాయక్ కూడా స్టార్ హీరోల చుట్టూ తిరగడం మానేశాడు.

    Also Read: భార్య అంటే కళ్యాణినే అట.. డైరెక్టర్ కన్నీళ్ళు !

    వినాయక్ మార్కెట్ పడిపోవడమే ఆయనను స్టార్ హీరోలకు దూరం చేసిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ పిలిచి మరీ వినాయక్ కి అవకాశం ఇచ్చారు. మరి వినాయక్ ఈ అవకాశాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. అయితే లూసిఫర్ మలయాళంలో సూపర్ హిట్ అవొచ్చు. అంతమాత్రాన మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన మూవీ అయితే కాదు. మొదట ఈ సినిమాకి డైరెక్షన్ చేయమని సుజీత్ ని అడిగినప్పుడే.. సుజిత్ ఇదే మాట చెప్పాడట. మీ స్థాయి సినిమా కాదు ఇది, మీ కోసం నేను ఒక కథ రాస్తాను అని ఒక లైన్ కూడా చెప్పాడని… ప్రస్తుతం సుజీత్ ఆ లైన్ మీదే వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది.