షాకిచ్చిన  బిగ్‌బాస్..  నోయల్ కే పట్టం.. 

ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మొదటి వారం పేలవంగా నడిచింది. ఈసారి పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరణ చూపలేదు. రెండో వారం గడుస్తున్న కొద్దీ బిగ్‌బాస్‌ కొంత ఎంటర్‌‌టైన్‌మెంట్‌ పెంచుతూ వచ్చారు. కొత్తగా ఇంట్లోకి అవినాష్‌ చేరడంతో కొంత కామెడీ పెరిగినట్లైంది. Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ ! బిగ్‌బిస్‌ హౌస్‌లో నిన్న 12వ రోజు ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఎపిసోడ్‌ సాగింది. […]

Written By: NARESH, Updated On : September 19, 2020 11:32 am

noyal bigboss

Follow us on


ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మొదటి వారం పేలవంగా నడిచింది. ఈసారి పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్‌ ఎవరూ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరణ చూపలేదు. రెండో వారం గడుస్తున్న కొద్దీ బిగ్‌బాస్‌ కొంత ఎంటర్‌‌టైన్‌మెంట్‌ పెంచుతూ వచ్చారు. కొత్తగా ఇంట్లోకి అవినాష్‌ చేరడంతో కొంత కామెడీ పెరిగినట్లైంది.

Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

బిగ్‌బిస్‌ హౌస్‌లో నిన్న 12వ రోజు ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఎపిసోడ్‌ సాగింది. స్కిట్స్‌, పాటలు, డ్యాన్సులతో కంటెస్టెంట్స్‌ హోరెత్తించారు. అయితే.. మధ్యమధ్యలో కొన్ని గొడవలు, అలకలు కూడా కనిపించాయి. ఇవి లేకుంటే అది బిగ్‌బాస్‌ హౌస్‌ ఎలా అవుతుందనుకోండి. అయితే.. ఇంటి సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారంటూ బిగ్‌బాస్‌ వారికి శిక్ష విధించారు. అంతేకాకుండా మూడో వారానికి ఇంటి కెప్టెన్‌ ఎంపిక సానుకూలంగా, ప్రశాంతంగా జరిగింది.

12వ రోజు ఇంటిలో ముఖ్యంగా టాస్క్‌లో భాగంగా రెండు స్కిట్లు జరిగాయి. అమ్మా రాజశేఖర్ టీమ్ ఒక జట్టు కాగా, కరాటే కల్యాణి ట్రూప్ మరో జట్టుగా చిన్న నాటకాలను ప్రదర్శించారు. పస్తులతో బాధపడే నాటక సమాజం నేపథ్యంగా అమ్మా రాజశేఖర్ స్కిట్‌ను ప్రదర్శించగా, సినిమా షూటింగ్ బ్రాక్‌డాప్‌లో కామెడీ స్కిట్‌ను కరాటే కల్యాణి ట్రూప్ చేసింది. అయితే ఈ స్కిట్స్‌లో గంగవ్వ డిసైడ్‌మెంట్‌ ప్రకారం కరాటే కల్యాణిని విజేతగా ప్రకటించారు. గంగవ్వ చెప్తే విజేత ప్రకటించడంపై అమ్మా రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. టాలెంట్ ఆధారంగా విజేతను ప్రకటించాలని సూచించాడు. కనీసం ఇద్దరిని విజేతలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే విజేతకు మాజా జ్యూస్ బాటిల్ బహుమతిగా ఇస్తానని ప్రకటించిన బిగ్‌బాస్.. రెండు జట్లకు రెండు మాజా బాటిల్స్ పంపడంతో వివాదం అక్కడితో ముగిసింది. దీంతో అమ్మా రాజశేఖర్‌‌ టీంలో సంబురాలు మిన్నంటాయి.

అయితే.. ఈ స్కిట్లలో ఇంటి సభ్యులు నిబంధనలు పాటించలేదని బిగ్‌బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాకపోవడం.. తెలుగు మాట్లాడకపోవడంతో ఫైర్‌‌ అయ్యారు. బెల్‌ మోగిన సమయంలో గార్డెన్‌ ఏరియాలోకి వచ్చి 20 గుంజీలు తీయాలని, బోర్డుపై ‘బిగ్‌బాస్‌ మమ్మల్ని క్షమించాలని’ అని రాయాలన్నారు.  అంతేకాకుండా.. సుజాత నుంచి మోనాల్ గజ్జర్, అభిజిత్, అఖిల్ సార్థక్, నోయల్‌ తెలుగు నేర్చుకోవాలి. ఇక నుంచి తెలుగులోనే మాట్లాడాలని సూచించింది. ఇంటి సభ్యులు నియమాలను పాటించకపోవడంతో దానికి బాధ్యతగా కెప్టెన్ లాస్యకు కూడా పనిష్‌మెంట్ ఇచ్చారు. బెల్ మోగిన ప్రతీసారి తనకు ఇష్టమైన వస్తువును త్యాగం చేస్తూ స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని ఆదేశించాడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు మొదటగా నెయిల్ పాలిష్ త్యాగం చేసింది.

Also Read: ఒక్క శ్రావణి.. ముగ్గురు నిందితులు..

ఆ తర్వాత ఇంటిలో కెప్టెన్ ఎంపిక మొదలైంది. నోయల్, అభిజిత్, మెహబూబ్, కల్యాణి  కెప్టెన్ రేసులోకి వచ్చారు. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో నోయల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. కెప్టెన్‌గా ఎన్నికైన నోయల్‌ను బిగ్‌బాస్ అభినందించారు.