Pawan Kalyan and Allu Arjun : సోషల్ మీడియా లో సెలబ్రిటీస్ కి ఉండే ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ రంగానికి చెందిన వారైనా సరే, సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటారు. అలా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సోషల్ మీడియా లో అత్యధికంగా నెటిజెన్స్ మాట్లాడుకున్న టాప్ 10 సెలబ్రిటీల జాబితా కాసేపటి క్రితమే వచ్చింది. ఇందులో మన టాలీవుడ్ నుండి కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మాత్రమే టాప్ 10 లో ఉండడం గమనించాల్సిన విషయం. తమిళనాడు నుండి తలపతి విజయ్(Thalapathy Vijay), బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్(Akshay Kumar) వంటి వారికి స్థానం దక్కింది. కేవలం ఈ నలుగురు సినీ సెలబ్రిటీలు మినహా, మిగతా వాళ్లంతా రాజకీయ ప్రముఖులు, క్రికెటర్స్ మాత్రమే ఉన్నారు. ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారో ఒకసారి వివరంగా ఈ కథనం లో చూద్దాము.
Also Read : ఆ ఒక్క విషయం వల్లే అల్లు అర్జున్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ కామ్ గా ఉంటున్నాడు..?
మొదటి స్థానం లో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కొనసాగుతున్నాడు. పగల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పేరు సోషల్ మీడియా లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజెన్స్ అత్యధికంగా ప్రస్తావించడమే అందుకు కారణం అయ్యుండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. అదే విధంగా రెండవ స్థానం లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, మూడవ స్థానం లో విరాట్ కోహ్లీ, నాల్గవ స్థానం లో రోహిత్ శర్మ ఉన్నారు. వీళ్ళ తర్వాత మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 5 స్థానంలో ఉన్నాడు. ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. అందుకే ఆయన టాప్ 5 లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఆయన తర్వాతి స్థానం లో మన భారత దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉండగా, 7వ స్థానం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఉన్నాడు.
ఇక 8వ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు. రాజకీయ పరంగా, సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా లో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆయన పేరు ఈ లిస్ట్ లో ఉన్నది. అదే విధంగా 9 వ స్థానం లో తమిళ హీరో విజయ్, పదవ స్థానం లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇక పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా పిలవబడే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లలో ఒక్కరి పేరు కూడా ఈ లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. ఈ హీరోలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడం వల్లనే లిస్ట్ లో లేకపోయాయి ఉండొచ్చని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కంటే ఒక మెట్టు ఎక్కువ ఉండడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.