Allu Arjun and Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై మొట్టమొదటిసారి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాడు. గోటి తో పోయే వ్యవహారాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. మంగళగిరి లో జరిగిన మీడియా చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి మీడియా తో మాట్లాడుతూ ‘అభిమాని చనిపోయాడు అని తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. కనీసం వెంటనే స్పందించాల్సింది. ఇక్కడ మానవతా దృక్పధం లోపించినట్టు అయ్యింది. ఈ విషయం లో కేవలం బన్నీ ఒక్కడిదే కాదు, మూవీ టీం తప్పు కూడా ఉంది. చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని, ఇలా అరెస్ట్ చేయించారని అంటున్నారు, అది సరికాదు’ అంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంకా ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు. క్రింది స్థాయి నుండి ఈ రేంజ్ కి వచ్చాడు. వైసీపీ పార్టీ లాగా కాకుండా, అక్కడ సినిమాలకు బెనిఫిట్ షోస్ ఇచ్చాడు, టికెట్ హైక్స్ కూడా అందించాడు. ఈ పూర్తి వ్యవహారం లో తెర ముందు, వెనుక ఏమి జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనలలో పోలీసులను కూడా నేను తప్పుబట్టను. థియేటర్ యాజమాన్యం అనుమతి లేదు అనే విషయం ముందుగా అల్లు అర్జున్ కి చెప్పాల్సింది’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, అతన్ని ఎందుకు కలవలేదంటే, అల్లు అర్జున్ వైపు తప్పు ఉందని పవన్ కళ్యాణ్ నమ్మడం వల్లే అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు.
గత ఆరు నెలల నుండి అల్లు అర్జున్ అభిమానుల మధ్య, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి. ఇరువురి హీరోల అభిమానులు నంద్యాల ఘటన నుండి ట్రోల్స్ వేసుకుంటూ ఉన్నారు. ఈ వివాదాలకు చెక్ పడితే బాగుండును అని మెగా అభిమానులు కోరుకుంటున్న ఈ సమయంలో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ హాట్ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. డిప్యూటీ సీఎం స్థాయి హోదా లో పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగా హాట్ టాపిక్ అనే చెప్పొచ్చు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసిన విషయం మీదనే స్పందించాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం తెలిసి ఉంటే ఇలా స్పందించేవాడు కాదని అంటున్నారు విశ్లేషకులు.