Pawan Kalyan and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక పొలిటికల్ గా కూడా ఆయన ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం… అందువల్లే ఆయన చేసే ప్రతి పనిని వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో వసూళ్లను రాబడుతూ భారీ విజయాలను నమోదు చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే… ఇక ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయడం మళ్ళీ హైకోర్టు అతనికి బేలివ్వడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.
మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. ఇక అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ని కలవాలని విపరీతమైన ప్రయత్నం చేస్తున్నప్పటికి పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల కలువలేకపోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
నిజానికి పవన్ కళ్యాణ్ కనక ఒకసారి మాట్లాడితే ఈ కేసు మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ ఆయన మాట్లాడటం లేదు కారణం ఏంటి అంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి దానికి అల్లు అర్జున్ తరపున పవన్ కళ్యాణ్ మాట్లాడలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటిషన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి సైడ్ మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది.
ఒకవేళ జనం సైడ్ మాట్లాడితే తన కుటుంబంలో ఉన్న అల్లు అర్జున్ అన్యాయం చేసిన వాడు అవుతాడు. అలాగని అల్లు అర్జున్ గురించి మాట్లాడితే జనానికి అన్యాయం చేసిన వాడు అవుతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా వరకు కామ్ గా ఉంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి…